WPL Full schedule : డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్‌తో షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
WPL Full schedule : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) 2026 షెడ్యూల్ వచ్చేసింది. బీసీసీఐ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
- Harish Thanniru
- Updated on- November 29, 2025 / 01:38 PM IST
WPL 2026
WPL Full schedule : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) 2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పూర్తి స్థాయి షెడ్యూల్ ను శనివారం వెల్లడించింది. జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ జనవరి 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ మాజీ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య నవీముంబయి వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ వడోదర వేదికగా ఫిబ్రవరి 5వ తేదీన జరగనుంది. అయితే, మ్యాచ్ లన్నీ ఈ రెండు వేదికల్లోనే నిర్వహించనున్నారు.
డబ్ల్యూపీఎల్ – 2026 లీగ్‌లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మొత్తం అయిదు జట్లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ 28రోజుల పాటు సాగనుంది. తొలి 11మ్యాచ్‌లు (జనవరి 9 నుంచి జనవరి 17వ తేదీ వరకు) నవీ ముంబయి వేదికగా జరగనుండగా.. ఆ తరువాతి మ్యాచ్‌లన్నీ (జనవరి 18 నుంచి ఫిబ్రవరి 5వరకు) వడోదర వేదికగా జరగనున్నాయి.
ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2026) ఆక్షన్ ముగిసిన విషయం తెలిసిందే. భారత ఆల్‌రౌండర్ దీప్తిశర్మ అత్యధికంగా రూ.3.20కోట్లు పలికింది. ఆమెను యూపీ వారియర్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగించి తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను రూ.3కోట్లకు ముంబయి ఇండియన్స్, భారత్ ఆల్‌రౌండర్ శిఖాపాండేను రూ.2.40 కోట్లకు యూపీ కొనుగోలు చేశారు. అలాగే న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ సోఫీ ఎకిల్ స్టోన్ ను రూ.2కోట్లకు గుజరాత్ జెయింట్స్ తీసుకుంది.
