Mumbai Indians have still chance to qualify for WPL 2026 playoffs after lost to Gujarat Giants
WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్ కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి లీగ్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్ర్కమించదు. ఎలిమినేటర్ కు అర్హత సాధించే ఓ చిన్న అవకాశం ఉంది. అయితే.. ఇందుకు కాస్త అదృష్టం కలిసి రావాలి.
డబ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) చివరి లీగ్ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 1న) ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తే.. అప్పుడు యూపీతో పాటు ముంబై ఇండియన్స్ ఇంటి ముఖం పడతాయి. అలా కాకుండా యూపీ గెలిస్తే.. అప్పుడు ముంబై, యూపీ, ఢిల్లీ జట్ల పాయింట్లు సమానంగా ఉంటాయి. నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉన్న జట్టు ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది.
ప్రస్తుతం ఢిల్లీ, యూపీలతో పోలిస్తే ముంబై నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉంది. అయితే.. యూపీ మరీ భారీ తేడాతో గెలవకుంటే అప్పుడు ముంబై ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది.
పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు 6 పాయింట్లు, +0.059 నెట్‌రన్‌రేటుతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ ఖాతాలో 6 పాయింట్లు, -0.164 నెట్ రన్‌రేటు ఉండగా, ఇక ఐదో స్థానంలో ఉన్న యూపీ ఖాతాలో 4 పాయింట్లు, -1.146 నెట్‌రన్‌రేటు ఉంది.