WPL 2026 Prize Money : ఆర్‌సీబీపై కోట్ల వర్షం.. విన్నింగ్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. ఏ అవార్డు ఎవరు అందుకున్నారంటే?
డబ్ల్యూపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడంతో ఆ జట్టుపై కనకవర్షం (WPL 2026 Prize Money ) కురిసింది.
- Thota Vamshi Kumar
- Published On : February 6, 2026 / 10:16 AM IST
WPL 2026 Prize Money List of all prize winners
WPL 2026 Prize Money : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2026) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గురువారం వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి రెండోసారి డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అత్యధిక సార్లు డబ్ల్యూపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఆర్‌సీబీ నిలిచింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా నాలుగోసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో ఓటమి పాలైంది.
కనకవర్షం..
విజేతగా నిలిచిన ఆర్‌సీబీ జట్టుకు రూ.6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ.3 కోట్లు అందాయి. ఇక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన స్మృతి మంధాన ఆరెంజ్ క్యాప్ అందుకోగా అత్యధిక వికెట్లు తీసిన సోఫీ డివైన్ పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచింది. వీరిద్దరికి చెరో 5 లక్షలు నగదు బహుమతిగా అందింది.
డబ్ల్యూపీఎల్ 2026 ప్రైజ్‌మనీ వివరాలు..
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (విజేత)- రూ.6 కోట్లు
* ఢిల్లీ క్యాపిటల్స్ (రన్నరప్) – రూ.3కోట్లు
* MVP ఆఫ్ ది ఇయర్ – సోఫీ డివైన్ – రూ.5 లక్షలు
* ఆరెంజ్ క్యాప్ – స్మృతి మంధాన- రూ. 5 లక్షలు
* పర్పుల్ క్యాప్ – సోఫీ డివైన్ – రూ. 5 లక్షలు
* అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రీడాకారిణి – హర్మన్‌ప్రీత్ కౌర్ – రూ. 5 లక్షలు
* అత్యధిక డాట్ బాల్స్ – లారెన్ బెల్ – రూ.5 లక్షలు
* ఈ సంవత్సరంలో అత్యధిక IQ – సోఫీ డివైన్ – రూ.5 లక్షలు
* ఉత్తమ స్ట్రైక్ రేట్ – గ్రేస్ హారిస్ – రూ.5 లక్షలు
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – నందిని శర్మ- రూ.5 లక్షలు
* ఫెయిర్ ప్లేయర్ అవార్డు – ముంబై ఇండియన్స్ – రూ.5 లక్షలు
* ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – స్మృతి మంధాన – రూ. 2.5 లక్షలు
