Jemimah Rodrigues : ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కామెంట్స్..
డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిపోవడంపై ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)స్పందించింది.
Jemimah Rodrigues comments after Delhi Capitals lost match to Royal Challengers Bengaluru
Jemimah Rodrigues :డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తమ జట్టు ప్రదర్శన పట్ల ఎంతో గర్వంగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. దురదృష్ట వశాత్తు తాము ఆశించిన ఫలితం రాలేదని అంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (57; 37 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసింది. లారా వోల్వార్డ్ట్ (44; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), లిజెల్ లీ (37; 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), చినెల్లే హెన్రీ (35 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సయాలి సత్ఘారే, నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డిలు తలా ఓ వికెట్ తీశారు.
WPL 2026 : ఆర్సీబీ విజయోత్సవ సంబురాలు.. స్మృతి మంధాన ఆనందం చూశారా.. ఫొటోలు వైరల్..
అనంతరం స్మృతి మంధాన (87; 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జియా వాల్ (79; 54 బంతుల్లో 14 ఫోర్లు) దంచికొట్టడంతో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో చినెల్లే హెన్రీ రెండు వికెట్లు తీసింది. నందిని శర్మ, మిన్నుమణి లు చెరో వికెట్ సాధించారు. ఇది ఆర్సీబీకి రెండో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ కాగా.. ఈ రెండు సార్లు ఫైనల్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌నే ఓడించడం గమనార్హం. ఇక డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి వరుసగా నాలుగో సారి ఫైనల్ చేరుకున్న ఢిల్లీ ప్రతిసారి నిరాశ తప్పలేదు.
జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది
మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని చెప్పింది. జట్టు ఫైనల్ చేరుకునేందుకు జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు సహకారాన్ని అందించారని అంది. తమ సర్వసాన్ని ధారపోశారని, అయితే.. తృటిలో కప్పు చేజారిందని తెలిపింది. జట్టు సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పని చేశారని, జట్టు వాతావరణం బాగుండేలా చూశారని చెప్పింది.
T20 World Cup 2026 : భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ.. పాక్‌ను వెంటాడుతున్న వరుణుడు.. ఫస్ట్ షాక్..
ఇక మైదానంలో ఢిల్లీ.. ఢిల్లీ అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఢిల్లీ అభిమానులందరికి కృతజ్ఞతలు. 203 స్కోరు అనేది ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎల్లప్పుడూ మంచి స్కోరు అని నేను అనుకుంటున్నాను. అయితే.. దాన్ని మేము కాపాడుకోలేకపోయాము.
మీకు తెలుసా మా టీమ్ ఎప్పుడైనా విజృంభించాలి అని కోరుకుంటే అది ఈ రోజే. అయితే.. దురదృష్ట వశాత్తు ఓడిపోయాము. సీనియర్లు రాణించారు. నందిని చాలా బాగా ఆడింది. మేము ఆశించిన దాని కంటే ఆమె చాలా ఎక్కుగానే రాణించింది. మిన్ను కూడా బాగా ఆడింది. యువ ప్లేయర్లు నేర్చుకుంటున్నారు. ఇది చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. అని జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది.
