ENG vs IND : ఇంగ్లాండ్ పై అద్భుత విజ‌యం.. డ‌బ్ల్యూటీసీ 2027 పాయింట్ల ప‌ట్టిక‌లో మెరుగైన భార‌త స్థానం.. ఎంతంటే?

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోనే భారత‌ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (2025-27) కొత్త సైకిల్ మొద‌లైంది.

WTC 2027 Points Table after India beat england in 2nd Test

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోనే భారత‌ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (2025-27) కొత్త సైకిల్ మొద‌లైంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 336 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించిన భార‌త్ డబ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగు స్థానాలు ఎగ‌బాకింది. ప్ర‌స్తుతం మూడో స్థానానికి చేరుకుంది.

డ‌బ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టు 100 శాతం విన్నింగ్ ప‌ర్సంటేజ్, 24 పాయింట్లతో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు శ్రీలంక రెండో స్థానంలో ఉంది. లంక జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించగా మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 66.67 గెలుపు శాతం, 16 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ ఎంత ప‌ని చేశావ‌య్యా.. నీ ఒక్క‌డి వ‌ల్ల బీసీసీఐకి రూ.250 కోట్ల న‌ష్టం?

ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే.. ఈ సైకిల్‌లో టీమ్ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోగా, మ‌రో మ్యాచ్‌లో గెలిచింది. 50 గెలుపుశాతంతో పాటు 12 పాయింట్లతో భార‌త్ మూడో స్థానంలో ఉంది. అటు భార‌త్ చేతిలో రెండో టెస్టులో ఓడిపోయిన ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఈ సైకిల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ ఓ మ్యాచ్‌లో గెల‌వ‌గా, మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయింది. 50 విజ‌య‌శాతంతో పాటు 12 పాయింట్లు జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి.

ENG vs IND : చ‌రిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్‌.. 8వ టెస్టులోనే 39 ఏళ్ల రికార్డును బ్రేక్‌..

ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకోగా, మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయింది. 16.67 విజ‌య‌శాతం 4 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన వెస్టిండీస్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. అయితే.. న్యూజిలాండ్, ద‌క్షిణాఫ్రికా, పాకిస్థాన్ లు డ‌బ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో ఇంకా మ్యాచ్‌ల‌ను ఆడ‌లేదు.