ENG vs IND : చ‌రిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్‌.. 8వ టెస్టులోనే 39 ఏళ్ల రికార్డును బ్రేక్‌..

టీమ్ఇండియా పేస‌ర్ ఆకాశ్ దీప్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

ENG vs IND : చ‌రిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్‌.. 8వ టెస్టులోనే 39 ఏళ్ల రికార్డును బ్రేక్‌..

Akash Deep scripts history Best match figures for India in England

Updated On : July 7, 2025 / 12:33 PM IST

టీమ్ఇండియా పేస‌ర్ ఆకాశ్ దీప్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ పై అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసిన టీమ్ఇండియా బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు ప‌డ‌గొట్ట‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 187 ప‌రుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలో చేత‌న్ శ‌ర్మ ను అధిగ‌మించాడు. 1986లో చేత‌న్ శ‌ర్మ సైతం ఇంగ్లాండ్ పై 188 ప‌రుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. కాగా.. వీరిద్ద‌రు కూడా ఎడ్జ్‌బాస్ట‌న్‌లో ఈ ఘ‌న‌త సాధించ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి త‌రువాత బుమ్రా, జ‌హీర్ ఖాన్‌లు ఉన్నారు.

ENG vs IND : భార‌త్ పై ఘోర ఓట‌మి.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెంట్స్‌.. మేం ఎక్క‌డ త‌ప్పుచేశామంటే..

ఇంగ్లాండ్ గడ్డ మీద ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్య‌ధిక వికెట్లు తీసి భార‌త బౌల‌ర్లు వీరే..

* ఆకాశ్‌ దీప్ – 10/187 – 2025లో ఎడ్జ్‌బాస్ట‌న్‌ వేదిక‌
* చేతన్‌ శర్మ – 10/188 – 1986లో ఎడ్జ్‌బాస్ట‌న్‌ వేదిక‌
* జస్‌ప్రీత్‌ బుమ్రా – 9/110 – 2021లో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదిక
* జహీర్‌ ఖాన్ – 9/134 – 2007లో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదిక

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ 336 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. భార‌త జ‌ట్టు విజ‌యంలో పేస‌ర్ ఆకాశ్ దీప్‌తో పాటు కెప్టెన్‌ శుభ్‌మ‌న్‌ గిల్‌ కీల‌క పాత్ర పోషించాడు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (269) బాద‌గా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (161) భారీ శ‌త‌కంతో చెల‌రేగాడు.

ENG vs IND : విజ‌యం సాధించినా అసంతృప్తిగానే గిల్‌.. మూడో టెస్టు తుది జ‌ట్టులో మార్పులు ఉంటాయ‌ని వెల్ల‌డి..

మ్యాచ్ వివ‌రాలు ఇవే..
భార‌త్ తొలి ఇన్నింగ్స్ – 587
ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్ – 407
భార‌త్ రెండో ఇన్నింగ్స్ – 427/6 డిక్లేర్‌
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ – 271