×
Ad

Shahid Afridi : ఆఖ‌రి ఓవ‌ర్ ఎలా వేయాలో తెలియ‌దా.. అల్లుడి పై షాహిద్ అఫ్రిది ఫైర్‌.. నువ్వు అస‌లు..

షాహీన్ అఫ్రిది పై అత‌డి మామ‌, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) మండిప‌డ్డాడు.

You Dont Know How To Bowl Last Over Shahid Afridi Slams Son In Law Shaheen

  • సొంత అల్లుడి పై షాహిద్ అఫ్రిది ఫైర్‌
  • షాహీన్ ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావ్‌
  • ఆఖ‌రి ఓవ‌ర్ ఎలా వేయాలో తెలియ‌దా?

Shahid Afridi : టీ20 ప్ర‌పంచ‌ప్ 2026లో పాకిస్థాన్ జ‌ట్టు సెమీస్‌కు చేర‌కుండా, సూప‌ర్‌-8 ద‌శ నుంచే నిష్ర్క‌మించింది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ పై విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది. స‌ల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) నాయ‌క‌త్వంలో ప్ర‌పంచ‌క‌ప్ బ‌రిలో దిగిన పాక్ జ‌ట్టు.. శ్రీలంక పై త‌ప్ప ఏ ఐసీసీ పూర్తి స‌భ్య జ‌ట్టు పై విజ‌యాన్ని న‌మోదు చేయ‌లేక‌పోయింది. శ్రీలంక పై కూడా స్వ‌ల్ప తేడాతోనే గెలుపొందింది.

వాస్త‌వానికి శ్రీలంక ను భారీ తేడాతో ఓడిస్తే పాక్ సెమీస్ చేరుకునే అవ‌కాశం ఉండేది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 212 ప‌రుగులు చేసింది. శ్రీలంక‌ను 147 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసి ఉంటే అప్పుడు పాక్ సెమీస్‌కు అర్హ‌త సాధించి ఉండేది. అయితే.. 213 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో లంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది.

Gautam Gambhir : సంజూ శాంస‌న్‌కు గెలుపు క్రెడిట్ మొత్తం ఇవ్వ‌ని గంభీర్‌.. 8 ప‌రుగులు చేసిన ఆట‌గాడి వ‌ల్లే గెలిచామ‌ని కామెంట్స్‌..

శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవ‌ర్‌ను పాక్ స్టార్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) వేశాడు. ఈ ఎడ‌మ చేతి వాటం పేస‌ర్ ఈ ఓవ‌ర్‌లో ఏకంగా 22 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దీనిపై అత‌డి మామ‌, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) మండిప‌డ్డాడు. అత‌డు చాలా కాలంగా ఆడుతున్న‌ప్ప‌టికి కూడా.. చివ‌రి ఓవ‌ర్‌ను ఎక్క‌డి నుంచి ఎలా వేయాలో అత‌డికి తెలియ‌డం లేద‌న్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యం చాలా సార్లు చెప్పామ‌ని, అయిన‌ప్ప‌టికి కూడా అత‌డు ప‌దే ప‌దే అలాంటి త‌ప్పుల‌నే పున‌రావృతం చేస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్ప‌టికైనా అతడు నేర్చుకోవాల‌ని సూచించాడు.

అలా బౌలింగ్ చేసి ఉంటే..

‘కుడిచేతి వాటం ఆట‌గాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. మీరు రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయ‌కూడ‌దు. ఒక‌వేళ ఎడ‌మ చేతి వాటం బౌల‌ర్ రౌండ్ ద వికెట్ నుంచి బౌలింగ్ చేయాల‌నుకుంటే.. అప్పుడు స్టంప్స్‌ను ల‌క్ష్యంగా చేసుకుని బాల్స్ వేయాల్సి ఉంటుంది. థ‌ర్డ్ మ్యాన్‌, పాయింట్ ఫీల్డ‌ర్లు స‌ర్కిల్ లోప‌ల ఉన్న‌ప్పుడు.. వైడ్ యార్క‌ర్లు వేయ‌కూడ‌దు. ఆసియా పిచ్‌ల‌పై అలాచేస్తే బ్యాట‌ర్లు ఈజీగా ప‌రుగులు చేస్తారు. ఒక‌వేళ మీరు ఓవ‌ర్ ద వికెట్ నుంచి బౌలింగ్ చేసి ఉంటే అప్పుడు బ్యాట‌ర్ల‌కు సిక్స‌ర్లు కొట్ట‌డం క‌ష్టం అయ్యేది. ఈ కుర్రాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో అనే విష‌యం నాకు అర్థం కావ‌డం లేదు. అస‌లు వారు నేర్చుకోరు లేదా వారు నేర్చుకోవాలనుకోవడం లేదు.’ అని షాహిద్ అఫ్రిది అన్నారు.

Suryakumar Yadav : సెమీస్‌లో భార‌త్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ హాట్ కామెంట్స్‌.. ఆ విష‌యం మాకు తెలుసు.. మేము ఆడిన విధానం చూసుకుంటే..

షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ పేలవ ప్ర‌ద‌ర్శ‌న పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆట‌గాళ్ల‌పై భారీ జ‌రిమానాల‌ను విధించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పాక్ క‌రెన్సీలో ఒక్కొ ఆట‌గాడికి 5 మిలియ‌న్ల జ‌రిమానాను విధించాల‌ని యోచిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై పీసీబీ తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని ఆయా వార్త‌ల సారాంశం.