Yuvraj Singh : గంగూలీ వ‌చ్చాడు.. యువ‌రాజ్‌ను తెచ్చాడు..

Yuvraj Singh : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో కీల‌క బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నాడు.

Yuvraj Singh appointed as Delhi Capitals team assistant coach and batting coach

Yuvraj Singh : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో కీల‌క బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నాడు. అత‌డు ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు స‌హాయ కోచ్‌, బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మితులు అయ్యాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. కాగా.. ఐపీఎల్‌లో యువీ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డ‌డం ఇదే తొలిసారి. ఇటీవ‌లే ఆ జ‌ట్టు హెడ్ కోచ్‌గా సౌర‌వ్ గంగూలీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

టీమ్ఇండియాకు 2000 నుంచి 2017 వరకు యువీ ప్రాతినిథ్యం వ‌హించాడు. 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ భార‌త జ‌ట్టు గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

IND vs WI : ఉప్ప‌ల్‌లో వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌ నేడే.. అటు తిల‌క్ వ‌ర్మ ఇటు సంజూ శాంస‌న్‌ల‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. అందుకునేది ఎవ‌రో?

డీసీ పోస్ట్ చేసిన వీడియోలో యువీ గురించి గంగూలీ ఇలా అన్నారు.. అసలు పులిగా ఉండటమంటే ఏమిటి? నిర్భయంగా ఉండటమా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమా? కోట్లాది మంది ప్రజల ఆశలను మోయడమా? లేక ఎవరూ చూడలేని యుద్ధం చేయడమా? పులులను కేవలం వాటి విజయాలతోనే నిర్వచించలేరు. ఒక పులి నాయకత్వం వహిస్తుంది. ఒక పులి స్ఫూర్తినిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, ఒక పులి నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తన కొత్త పాత్ర గురించి యువీ మాట్లాడుతూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఈ ఫ్రాంచైజీతో పాత అనుబంధం ఉంది. ఈ ఫ్రాంఛైజీ యజమానులు నాకు చాలా బాగా తెలుసు. అందువల్ల ఇది నాకు ఒక ప్రత్యేకమైన అవకాశం. దాదాతో కలిసి పనిచేయడానికి కూడా నేను ఎదురుచూస్తున్నాను. కోచింగ్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. అత్యంత ప్రతిభావంతులైన ఈ జట్టుతో కలిసి ప‌ని చేయ‌డానికి ఇక నేను వేచి ఉండలేను. ఇది నాకు ఒక ఉత్తేజకరమైన ప్రయాణం అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడానికి ఎదురుచూస్తున్నాను. అంటూ యువ‌రాజ్ చెప్పాడు.

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌ప్పు గెల‌వ‌ని జ‌ట్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక‌టి. గంగూలీ, యువీలు క‌లిసి ఢిల్లీకి క‌ప్పు అందిస్తారో చూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియాలో గంగూలీ నాయ‌కత్వంలో యువీ అరంగ్రేటం చేశాడు. ఆ స‌మ‌యంలో యువ‌కుడిగా ఉన్న యువీకి గంగూలీ ఎంతో మ‌ద్ద‌తుగా నిలిచాడు.