Yuzvendra Chahal : ప్రపంచ రికార్డు పై చాహల్ కన్ను.. మూడు అడుగుల దూరం..
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 13, 2024 / 02:56 PM IST
Yuzvendra Chahal Needs 3 Wickets To Create New World Record
Chahal : రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించేందుకు మరో మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. చాహల్ మరో మూడు వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో 200 వికెట్ల క్లబ్ లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు అతడు 197 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా..ఛండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ నేడు (ఏప్రిల్ 13) శనివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అతడు ఈ రికార్డును అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాయల్స్ ఐదు మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Rohit Sharma : వచ్చే ఏడాది చెన్నై కెప్టెన్‌గా రోహిత్ శర్మ : మైఖేల్ వాన్
ఐపీఎల్‌లో చాహల్ ప్రస్థానం..
2011లో అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే.. 2013 సీజన్‌లో అతడికి తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఆ సీజన్‌లో కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. ముంబై అతడిని విడిచిపెట్టగా 2014లో ఆర్‌సీబీ అతడిని కొనుగొలు చేసింది. ఆర్‌సీబీ తరుపున చాహల్ చాలా కాలం పాటు ఆడాడు. 2022లో అతడిని బెంగళూరు వేలానికి విడిచిపెట్టింది.
2022 మెగావేలంలో చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్ వేలంలో దక్కించుకుంది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన చాహల్ 10 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ పై అతడికి మంచి రికార్డు ఉంది. పంజాబ్ పై 19 మ్యాచులు ఆడిన చాహల్ 29 వికెట్లు పడగొట్టాడు.
Jake Fraser McGurk : కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎవరు?
