Yuzvendra Chahal : టెస్టులు ఆడాలన్న నా కల ఇక నెరవేరదు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన చాహల్.. మరోసారి టీమ్ఇండియా తరుపున ఆడతా..
టీమ్ఇండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు
Yuzvendra Chahal retires from first class cricket vows to continue playing white ball formats
Yuzvendra Chahal : టీమ్ఇండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టు తరుపున టెస్టు క్రికెట్ ఆడాలనే తన చిరకాల స్వప్నం ఇక సాధ్యం కాదని చెప్పేశాడు. అయితే.. అదే సమయంలో వైట్ బాల్ ఫార్మాట్లలలో మాత్రం జాతీయ జట్టుకు మరోసారి ఆడతాననే ధీమాను వ్యక్తం చేశాడు.
దేశీయ, కౌంటీ సర్క్యూట్లలో 17 ఏళ్ల కెరీర్ ఉన్నప్పటికీ కూడా చాహల్‌కు ఎన్నడూ భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. టీమ్ఇండియా తరుపున అతడు 72 వన్డేలు, 80 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 121 వికెట్లు, టీ20ల్లో 96 వికెట్లు తీశాడు. చివరిసారిగా అతడు భారత్ తరుపున 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు.
నేను పట్టుకున్న మొట్టమొదటి క్రికెట్ బంతి ఒక ఎర్ర బంతి. అప్పుడు నా వయసు 10 ఏళ్లు. ఈ ఆటతో నేను ఇంత గాఢంగా ప్రేమలో పడతానని అప్పుడు నాకు ఏమాత్రం తెలియదు. నాకు రెడ్-బాల్ క్రికెట్ కేవలం మరో ఫార్మాట్ మాత్రమే కాదు. ఓర్పు, వ్యక్తిత్వం, పట్టుదల, ఇంకా గంటల తరబడి మైదానంలో ఉండి, ప్రతి పరుగు కోసం, ప్రతి వికెట్ కోసం పోరాడడంలో ఉండే స్వచ్ఛమైన ఆనందం. వీటన్నింటినీ నేను అక్కడే నేర్చుకున్నాను.
View this post on Instagram
నేను నా చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను లార్డ్స్‌లో ఆడాను. ఈ మాటలు చెబుతుంటే భావోద్వేగంగా ఉంది. ఎందుకంటే టెస్ట్ క్యాప్ సాధించడం ఎప్పటినుంచో నా కల. అది సాకారం కాకపోయినప్పటికీ, నా ప్రయాణం పట్ల నాకు పూర్తి సంతృప్తి ఉంది. ఈ ఫార్మాట్లో నాకు లభించిన ప్రతి అవకాశానికి నేను ఎంతో కృతజ్ఞుడనై ఉంటాను. ఎర్ర బంతి నా జీవితంలో కొన్ని అత్యంత అందమైన జ్ఞాపకాలను ఇచ్చింది, వాటిని ఏదీ నా నుండి దూరం చేయలేదు.
నా ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదు. దేశం తరఫున ఆడాలన్న తపన నాలో ఇంకా బలంగానే ఉంది. నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని నేను నమ్ముతున్నాను. వన్డే, టీ20 ఫార్మాట్లలో మరో అవకాశం దక్కించుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. ఇక నా ప్రయాణంలో నిరంతరం మద్దతు, నమ్మకం, భరోసా అందించిన హర్యానా క్రికెట్ అసోసియేషన్, రణబీర్ సింగ్ మహీంద్రా, అనిరుధ్ సింగ్ చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు. మొదటిసారి ఎరుపు రంగు బంతిని చేతిలోకి తీసుకున్న 10 ఏళ్ల బాలుడి దశ నుండి చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడే స్థాయికి చేరడం వరకు.. ఇది నిజంగా అద్భుతమైన ప్రయాణం. అని చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
Sanju Samson : పాకిస్థాన్‌తో గోల్డ్ మెడల్ మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
2009లో హర్యానా తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన చాహల్.. తన రెడ్-బాల్ కెరీర్లో 49 మ్యాచ్‌లలో 32.27 సగటుతో 148 వికెట్లు పడగొట్టాడు.
