Sanju Samson : పాకిస్థాన్‌తో గోల్డ్ మెడల్ మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
ఆసియా క్రీడలు 2026లో భాగంగా శనివారం పాకిస్థాన్‌తో జరగనున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్‌ను (Sanju Samson) ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.
Asian Games 2026 India vs Pakistan Gold Medal Match tomorrow Sanju Samson eye on massive record
Sanju Samson : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరగనున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరోసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. కాగా.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత స్టార్ ఆటగాడు సంజూ శాంసన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 6 సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వంద సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు మాత్రమే భారత్ తరుపున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు.
ఇక టీమ్ఇండియా తరుపున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. 159 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 205 సిక్సర్లు బాదాడు. 200 సిక్సర్ల క్లబ్లో భారత్ తరుపున అతడు ఒక్కడే ఉన్నాడు.
సంజూ శాంసన్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 71 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 27 సగటుతో 1565 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 94 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 61 మ్యాచ్‌ల్లో 127 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 71 మ్యాచ్‌ల్లో 94 సిక్సర్లు
