IND vs ZIM : భార‌త్ ఇజ్జ‌త్ తీసిన జింబాబ్వే కెప్టెన్.. సిరీస్‌లో టీమ్ఇండియా ఫేవ‌రేట్ కాదు.. సికింద‌ర్ రజా కీల‌క వ్యాఖ్య‌లు..

హ‌రారే వేదిక‌గా గురువారం (జూలై 23) నుంచి భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య (IND vs ZIM) మూడు మ్యాచ్‌ల టీ20 జ‌ర‌గ‌నుంది

Zimbabwe Captain Sikandar Raza comments viral ahead of IND vs ZIM T20 series

IND vs ZIM : హ‌రారే వేదిక‌గా గురువారం (జూలై 23) నుంచి భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వే టీ20 కెప్టెన్ సికింద‌ర్ ర‌జా మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌లో భారత్ తిరుగులేని ఫేవరెట్ అనే వాదనను అత‌డు కొట్టిపారేశాడు. సిరీస్ హోరాహోరీగా సాగుతుందని చెప్పాడు. సిరీస్‌ను కైవ‌సం చేసుకునేందుకు ఇరు జ‌ట్ల‌కు స‌మాన అవ‌కాశాలు ఉన్నాయ‌న్నాడు.

‘ఈ సిరీస్‌లో గెలిచేందుకు ఇరు దేశాలకు సమాన అవకాశం ఉంటుంది. కానీ నాకు ఒక విషయంపై పూర్తి నమ్మకం ఉంది. జింబాబ్వే చాలా నిలకడగా, వినోదాత్మకంగా క్రికెట్ ఆడుతున్నందున, ఈ సిరీస్ కూడా చాలా వినోదాత్మకంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను.’ అని రజా తెలిపాడు.

IND vs ZIM : గురువారం నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. జియో, సోనీల‌లో రాదు.. ఎక్క‌డ చూడొచ్చంటే?

భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం ప‌రివ‌ర్త‌న ద‌శ‌లో ఉంద‌న్నాడు. జింబాబ్వే కూడా కొంత మేర అలాగే ఉంద‌ని, కాబ‌ట్టి సిరీస్‌ను ఏక‌ప‌క్షంగా చూడ‌కూడ‌ద‌న్నాడు.

ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సాధించిన చిరస్మరణీయమైన 23 పరుగుల విజయం టోర్నమెంట్ అంతటా ప్రకంపనలు సృష్టించింది, ఈ ఓటమితో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే అనూహ్యంగా నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026ను కైవ‌సం చేసుకున్న త‌రువాత భార‌త్ ఇంత వ‌ర‌కు 7 టీ20 మ్యాచ్‌లు ఆడగా ఒక్క‌దానిలోనూ విజ‌యం సాధించ‌లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ బెల్ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో పరాజయం పాలైన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే.

భార‌త్, జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – జూలై 23న
* రెండో టీ20 మ్యాచ్ – జూలై 25న‌
* మూడో టీ20 మ్యాచ్ – జూలై 26న

Ashwin : రోహిత్, కోహ్లీల‌ను ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేరు.. అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయ‌ట‌..

ఇక ఈ మూడు మ్యాచ్‌లు హ‌రారే వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.