2023 Hero Karizma XMR 210 launched at Rs. 1.72 lakh, Legend returns in new avatar
Hero Karizma XMR 210 : ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఎట్టకేలకు హీరో కరిజ్మా XMR 210ని లాంచ్ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త కరిజ్మా బైక్.. 4 ఏళ్ల తర్వాత కొత్త అవతార్‌తో తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టింది. హీరో (Karizma XMR 210) బైక్ ప్రీమియం ఉత్పత్తుల్లో కీలక భాగం.
ఈ బైక్ ప్రారంభ ధరగా రూ. 172,900 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉండనుంది. కొన్ని వారాల్లో ఈ బైక్ ధర పెరిగే అవకాశం ఉంది. కొత్త కరిజ్మా బైక్ బుకింగ్ ఆగస్టు 29 నుంచి ప్రారంభమైంది. కరిజ్మా ఆధునిక మోడల్ బైక్ అయినప్పటికీ.. కొత్త మోడల్ 2003లో ప్రవేశపెట్టిన ఒరిజినల్ మోడల్ మాదిరిగా కొన్ని సిగ్నేచర్ స్టైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు అత్యంత విజయవంతమైన ఉత్పత్తులలో హీరో కరిజ్మా ఒకటిగా నిలిచింది. మొదటిసారిగా 2003లో హోండా, హీరో మోటోకార్ప్‌ల సహకారంతో అందుబాటులోకి వచ్చింది. కరిజ్మా బైక్ సేల్స్ జనవరి 2019 వరకు జరిగాయి.. మారుతున్న టెక్నాలజీతో గత దశాబ్దంలో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.
హీరో మోటోకార్ప్ చివరకు మోటార్‌సైకిల్‌ను నిలిపివేసింది. అయినప్పటికీ, కరిజ్మా క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అదే.. కొత్త అవతార్‌లో లెజెండరీ కరిజ్మా బైక్‌ను తీసుకువచ్చేలా ప్రేరేపించింది. కొత్త హీరో కరిజ్మా XMR 210 ముందున్న దానితో పోలిస్తే.. స్పోర్టివ్‌గా, మరింత సున్నితత్వంతో కనిపిస్తుంది. అయితే, అధునాతన టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లతో వచ్చిన కొత్త మోడల్లో కూడా సిగ్నేచర్ స్టైలింగ్ అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
హీరో కరిజ్మా XMR 210 ధర ఎంతంటే? :
హీరో కరిజ్మా XMR 210 ప్రారంభ ధర రూ. 172,900 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమైంది. వెల్కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత ఈ బైక్ ధర రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. అలాగే, ఆగస్ట్ 29 మధ్యాహ్నం నుంచి ఈ బైక్ బుకింగ్‌కు అందుబాటులో ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది.
2023 Hero Karizma XMR 210 launched at Rs. 1.72 lakh, Legend returns in new avatar
హీరో కరిజ్మా XMR 210 డిజైన్ :
హీరో కరిజ్మా (XMR 210) అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంది. చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. టర్న్ ఇండికేటర్లు, టెయిల్ల్యాంప్ కూడా LED టచ్‌ని కలిగి ఉంటాయి. స్పోర్టీ బైక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ విండ్ గార్డ్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బైక్ ఏరోడైనమిక్ సామర్థ్యంతో వస్తుంది.
సెమీ ఫెయిరింగ్ కరిజ్మా గత మోడల్ మాదిరిగానే ఉంది. అలాగే, స్ప్లిట్ సీట్ లేఅవుట్‌ను కలిగి ఉంది. పిలియన్ స్టెప్డ్ అప్, ఇరుకైన టెయిల్ సెక్షన్ బైక్‌కి మరింత స్టయిల్‌ను అందిస్తుంది. కరిజ్మా XMR 210 బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ టెక్‌తో వచ్చే ఫుల్ డిజిటల్ కలర్ LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ కరిజ్మా బైక్ ఐకానిక్ ఎల్లో, మ్యాట్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ అనే 3 విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
హీరో కరిజ్మా XMR 210 ఇంజిన్, స్పెషిఫికేషన్లు :
హీరో కరిజ్మా XMR 210 కొత్త పవర్ ఇంజిన్ కలిగి ఉంది. బైక్‌కు శక్తినిచ్చే 210 cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 25.15 bhp గరిష్ట శక్తిని, 20.4 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ డ్యూటీకి ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హీరో కరిజ్మా XMR 210 బ్రేక్, సస్పెన్షన్ :
ఈ బైక్‌కు సస్పెన్షన్ డ్యూటీ అమర్చి ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్బర్లు రైడింగ్ ఉన్నాయి. బ్రేకింగ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. కరిజ్మా XMR 210 బైక్ డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.