Best 5G Phones 2026 : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 20వేల లోపు ధరలో 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటారంటే?

Best 5G Phones 2026 : ఈ మార్చి నెలలో రూ. 20వేల లోపు ధరలో కొనుగోలు చేయగల 5 బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో ఏది కొంటారో కొనేసుకోండి.

5 Best 5G Phones ( Image credit to Original Source )

  • రూ. 20వేల లోపు ధరలో 5 అద్భుతమైన ఫోన్లు ఇవే
  • రియల్‌మి నుంచి శాంసంగ్ ఫోన్ల వరకు ఏది కొనొచ్చు?
  • అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో

Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో వందలాది ఫోన్లలో ఏది కొనాలో తెలియక కస్టమర్లు గందరగోళానికి గురవుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 20వేల లోపు ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

కెమెరాల నుంచి ప్రాసెసర్ వరకు క్లీన్ యూఐతో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు మీ బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. 2026లో మీరు కొనుగోలు చేసేందుకు కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

రియల్‌మి నార్జో 80ప్రో 5జీ (రూ. 19,999):
రియల్‌మి నార్జో 80 ప్రో 5జీ ఫోన్ డ్యూయల్ 50MP రియర్ కెమెరాతో 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 6.72 అంగుళాల OLED డిస్‌ప్లే , 1B కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీ, 80W ఛార్జర్‌తో వస్తుంది.

రెడ్‌మి 15 5జీ (రూ. 19,499):
రెడ్‌మి 15 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ యూనిట్ డ్యూయల్ 50MP రియర్ కెమెరాతో వస్తుంది. అసిస్టెన్స్ లెన్స్‌లతో 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో ఈ యూనిట్ 7000mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : LPG Gas Cylinder : గ్యాస్ అయిపోయిందా? ఇలా బుక్ చేశారంటే జస్ట్ 2 గంటల్లోపే ఇంటికి సిలిండర్.. ఫాస్ట్ డెలివరీ ట్రిక్స్!

మోటోరోలా G96 (రూ. 19,499) :
మోటోరోలా G96లో డ్యూయల్ కెమెరా 50MP + 8MP, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ యూనిట్ 1B కలర్స్ తో 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 5500mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

ఒప్పో K13 5జీ (రూ. 19,999) :
ఒప్పో K13 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అసిస్టెన్స్ లెన్స్‌తో డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ యూనిట్ 7000mAh బ్యాటరీ, 80W ఛార్జర్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A07 5జీ (రూ. 17,999) :
శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల PLS LCD డిస్‌ప్లేతో వస్తుంది. డ్యూయల్ 50MP రియర్ కెమెరా కూడా ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో పవర్ అందిస్తుంది. వన్ యూఐ 8పై రన్ అవుతుంది. ఇంకా, 6000mAh బ్యాటరీతో పాటు 25W ఛార్జర్‌తో వస్తుంది.