Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. DSLR రేంజ్ కెమెరాతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు.. మీ ఫేవరెట్ ఏంటి?

Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రస్తుతం డీస్ఎల్ఆర్ రేంజ్ కెమెరాతో మార్కెట్లో అద్భుతమైన కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కెమెరా ఫోన్ కొనేసుకోండి..

Best Camera Phones

  • డీఎస్ఎల్ఆర్ కెమెరా రేంజ్‌లో అద్భుతమైన కెమెరా ఫోన్లు
  • ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ నుంచి వివో X300 అల్ట్రా వరకు ఫోన్లు
  • 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ లెన్స్ జైస్ ఆప్టిక్స్‌

Best Camera Phones : కొత్త కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? DSLR కెమెరా రేంజ్‌లో అద్భుతమైన కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, వివో ఎక్స్300 అల్ట్రా, ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా, షావోమీ 17 అల్ట్రా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. క్రియేటర్లు, ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 200MP సెన్సార్లు, పెరిస్కోప్ జూమ్, 8K వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ HDR, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి.

2026లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్ (Best Camera Phones) పెరిగింది. కాంపాక్ట్ కెమెరాలు, రోజువారీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్ వీడియో వర్క్‌లో కూడా డీఎస్ఎల్ఆర్ కెమెరాలకు గట్టిపోటీగా నిలుస్తున్నాయి.

భారీ సెన్సార్ల నుంచి అడ్వాన్స్ జూమ్ సిస్టమ్‌లు, సినిమాటిక్ రికార్డింగ్ మోడ్‌ల వరకు కెమెరా ఫోన్‌లు నిలిచాయి. డీఎస్ఎల్ఆర్ వంటి ఫొటోగ్రఫీని కోరుకుంటే ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే 5 ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (రూ. 1,49,900) :
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో 4x పెరిస్కోప్ జూమ్ లెన్స్, LiDAR స్కానర్ అడ్వాన్స్ స్టెబిలైజేషన్‌తో ట్రిపుల్ 48MP కెమెరా సిస్టమ్ ఉంది. ప్రోరేస్ (RAW), డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ ఆపిల్ లాగ్ 2 వంటి వీడియో ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం డీఎస్ఎల్ఆర్ స్టయిల్ వీడియో, ఫొటోగ్రఫీ పర్ఫార్మెన్స్ అందించే ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ అందిస్తోంది.

Read Also : Samsung Vision AI TV : కొత్త శాంసంగ్ టీవీ అదుర్స్.. పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లు, భారీ డిస్‌ప్లేతో 2026 విజన్ ఏఐ టీవీ!

వివో X300 అల్ట్రా (రూ. 1,59,999) :
వివో X300 అల్ట్రా ఫోన్ 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ లెన్స్ జైస్ ఆప్టిక్స్‌తో వస్తుంది. గింబల్ స్టెబిలైజేషన్, 8K రికార్డింగ్, డాల్బీ విజన్ HDR ఆప్షనల్ ఎక్స్‌ట్రనల్ జూమ్ లెన్స్‌ వంటి ఫీచర్లు, అద్భుతమైన కెమెరా ఫోన్‌గా మార్చాయి. ప్రీమియం ఇమేజింగ్ స్మార్ట్‌ఫోన్, డీఎస్ఎల్ఆర్ కెమెరాతో వస్తుంది.

ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా (రూ. 1,69,999) :
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో 200MP మెయిన్ కెమెరా, డ్యూయల్ పెరిస్కోప్ జూమ్ లెన్స్‌లు, ప్రొఫెషనల్ తరహా ఫొటోల కోసం హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్ ఉన్నాయి. ఈ ఫోన్ O-Log2 రికార్డింగ్, సినిమాటిక్ LUTs, 8K వీడియోకు కూడా సపోర్టు ఇస్తుంది. ప్రస్తుతం డీఎస్ఎల్ఆర్ లాంటి ఫొటోగ్రఫీ సినిమాటిక్ వీడియోగ్రఫీ, కెమెరా సెంట్రలైజడ్ ఫ్లాగ్‌షిప్ అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా (రూ. 1,30,999) :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 200MP సెన్సార్, డ్యూయల్ టెలిఫోటో లెన్సులు, అడ్వాన్స్ ఆటోఫోకస్ సిస్టమ్‌ అందిస్తుంది. హొరైజన్ లాక్, 8K వీడియో, HDR10+, సూపర్ స్టెడీ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఫోటోలు, వీడియోలు రెండింటినీ అందిస్తాయి. 2026లో రోజువారీ ఫొటోగ్రఫీ కోసం డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది.

షావోమీ 17 అల్ట్రా రూ. 1,39,999 :
షావోమీ 17 అల్ట్రా ఫోన్ ఒక-అంగుళాల 50MP సెన్సార్, 200MP కంటిన్యూయస్ జూమ్ లెన్స్ లైకా-ట్యూన్డ్ ఇమేజింగ్ సిస్టమ్‌తో ఫొటోగ్రఫీ ప్రియులకు అద్భుతంగా ఉంటుంది. డాల్బీ విజన్ HDR రికార్డింగ్, అల్ట్రా-స్లో-మోషన్ వీడియోతో వస్తుంది. డీఎస్ఎల్ఆర్ రేంజ్ కెమెరాతో ఈ ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది.