Google I/O 2026 : గూగుల్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ.. సుందర్ పిచాయ్ 5 అతిపెద్ద AI ప్రకటనలు ఇవే!

Google I/O 2026 : గూగుల్ I/O 2026లో గూగుల్ జెమిని ఏఐకి సంబంధించిన కీలక అప్‌గ్రేడ్‌లను ఆవిష్కరించింది. జెమిని 3.5 నుంచి ఓమ్ని వరకు ఏఐకి సంబంధించి సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Sundar Pichai AI Announcements ( Image Credit : AI )

  • గూగుల్ ఫ్యూచర్ ఏఐ విజన్ ఇదే.. 5 అద్భుతమైన అప్‌డేట్స్!
  • ఏఐలో గూగుల్ కొత్త అధ్యాయం.. స్పార్క్, జెమిని ఫ్లాష్, యాంటీగ్రావిటీ
  • గూగుల్ భవిష్యత్తును చూపించిన సుందర్ పిచాయ్!

Google I/O 2026 : గూగుల్ ఐ/ఓ 2026 నుంచి కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ అనేక కొత్త ఏఐ టెక్నాలజీ ఫీచర్లను ఆవిష్కరించారు. ఈసారి, జెమిని ఏఐని మరింత పవర్‌ఫుల్ ఫీచర్లతో ఆవిష్కరించారు. కొత్త అప్‌డేట్‌లలో వాయిస్ డాక్యుమెంట్ ఎడిటింగ్, ఏఐ ఏజెంట్లు, ఫాస్ట్ ఏఐ మోడల్‌లు, యూట్యూబ్ కోసం స్మార్ట్ ఏఐ సెర్చ్ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి. పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ ప్రకటించిన 5 అతిపెద్ద ఏఐ అప్‌డేట్‌లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ డాక్స్‌లో మీ వాయిస్‌తో డాక్యుమెంట్ క్రియేషన్ :
యూజర్లు కేవలం తమ వాయిస్ ఉపయోగించి డాక్యుమెంట్‌లను క్రియేట్ చేయొచ్చు. అలాగే ఎడిట్ చేయొచ్చు. డాక్స్ లైవ్ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్ జెమిని ఏఐ పవర్ ద్వారా టైపింగ్ అవసరాన్ని భారీగా తగ్గిస్తుంది. సుందర్ పిచాయ్ ప్రకారం.. ఈ వేసవిలో ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్‌ల కోసం డాక్స్ లైవ్ రిలీజ్ అవుతుంది. భవిష్యత్తులో ఇదే ఫీచర్ ఇతర గూగుల్ యాప్‌లకు కూడా అందుబాటులోకి రానుంది.

యూట్యూబ్‌లోకి జెమిని ఏఐ సెర్చ్ :
జెమిని ఏఐ యూట్యూబ్‌లోకి రాబోతోందని గూగుల్ ధృవీకరించింది. ఈ కొత్త ఫీచర్‌కు ఆ సంస్థ ‘ఆస్క్ యూట్యూబ్’ అని పేరు పెట్టింది. తద్వారా యూజర్లు వీడియోలు లేదా డేటా ఈజీగా పొందడానికి ఏఐని నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. ఈ ఫీచర్‌ను ఈ ఏడాది అమెరికాలో రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా విస్తరించవచ్చు.

జెమిని ఓమ్ని మోడల్ :
డెమిస్ హస్సాబిస్ కొత్త జెమిని ఓమ్ని మోడల్‌ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త మోడల్ గతిశక్తి, గురుత్వాకర్షణ వంటి సంక్లిష్టమైన శాస్త్రీయ అవగాహనలకు కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది. జెమిని ఓమ్ని ఫ్లాష్ ఇప్పుడు అనేక గూగుల్ ప్రొడక్టుల్లో అందుబాటులో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని కీలక అప్‌డేట్‌లు రిలీజ్ అవుతాయని హస్సాబిస్ వివరించారు.

జెమిని 3.5 ఫ్లాష్ మోడల్ :
గూగుల్, జెమిని 3.5 సిరీస్‌లో ఫస్ట్ మోడల్ జెమిని 3.5 ఫ్లాష్‌ లాంచ్ చేసింది. కోడింగ్, లాంగ్ టైమ్ టాస్కులు, రియల్ వరల్డ్ వర్క్‌ఫ్లోలలో ఈ మోడల్ గతంలో మోడల్ కన్నా ఫాస్ట్ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. సుందర్ పిచాయ్ ప్రకారం.. జెమిని 3.5 ఫ్లాష్ అనేక బెంచ్‌మార్క్‌లలో జెమిని 3.1 ప్రోను అధిగమించింది.

Read Also : Internet Shutdown Apps : ఇరాన్ కేబుల్స్ కట్ చేస్తుందట..! లో ఇంటర్నెట్, నో ఇంటర్నెట్‌తో పనిచేసే యాప్స్ ఇవే..

ఈ మోడల్ స్పీడ్ ఇతర ఏఐ కంపెనీల మోడళ్ల కన్నా సుమారు 4 రెట్లు వేగంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్ స్పీడ్ పెంచిన కొత్త ఏజెంట్-ఫస్ట్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్ యాంటిగ్రావిటీలో కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను వాడుతోందని గూగుల్ తెలిపింది.

యాంటీగ్రావిటీ 2.0తో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్‌లకు సవాలు :
ఏఐ ఏజెంట్ కోడింగ్ కోసం యాంటీగ్రావిటీ 2.0 అనే టూల్ గూగుల్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డెవలపర్లు ఇప్పటికే యాంటీగ్రావిటీని వాడుతున్నారు. కొత్తగా అప్‌డేట్ చేసిన ఈ సర్వీసుకు ఏఐ ఏజెంట్ల కోసం రూపొందించిన స్పెషల్ డెస్క్‌టాప్ అప్లికేషన్ కూడా ఉంది.

మల్టీ ఏఐ ఏజెంట్లు వివిధ టాస్కులను పూర్తి చేయొచ్చు. సబ్-ఏజెంట్లు, హుక్స్ అసింక్రోనస్ టాస్క్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు కూడా ప్రవేశపెట్టారు. యాంటీగ్రావిటీ 2.0లోని జెమిని 3.5 ఫ్లాష్ ఇతర ఏఐ సిస్టమ్‌ల కన్నా 12 రెట్లు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ రీసెర్చ్ ప్రివ్యూగా రిలీజ్ చేస్తుంది.

పర్సనల్ ఏఐ ఏజెంట్‌గా జెమిని స్పార్క్ :
గూగుల్ జెమిని స్పార్క్ అనే కొత్త ఏఐ ఏజెంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్ల డిజిటల్ లైఫ్ మరింత ఈజీ కానుంది. ఇది కేవలం చాట్‌బాట్ కాదు.. నిరంతరం పనిచేసే ఏఐ సిస్టమ్. గూగుల్ క్లౌడ్‌లో రన్ అయ్యే స్పెషల్ వర్చువల్ మెషీన్‌లను వాడుతుంది.

మీ ల్యాప్‌టాప్‌ను ఆఫ్ చేసినా లేదా డివైజ్ మార్చినా కూడా ఇది పనిచేస్తూనే ఉంటుంది. డెమో సమయంలో ఇమెయిల్‌లు, చాట్‌లు, డాక్యుమెంట్‌ల నుంచి డేటాను సేకరించి స్పార్క్ ఆటోమాటిక్ సమ్మరీ ఇమెయిల్‌లను క్రియేట్ చేయగలదని కంపెనీ ప్రదర్శించింది.

గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లకు వచ్చే వారం బీటా యాక్సెస్ లభిస్తుంది. రాబోయే రోజుల్లో జెమిని స్పార్క్‌ను క్రోమ్ బ్రౌజర్‌లో విలీనం చేయాలని గూగుల్ యోచిస్తోంది. తద్వారా వెబ్‌లోని అనేక పనులను ఆటోమాటిక్ పూర్తి చేయగలదు.

గూగుల్ ఏఐ అల్ట్రా ప్లాన్ ధర తగ్గింపు :
గూగుల్ నెలకు 100 డాలర్ల ధరతో కొత్త గూగుల్ ఏఐ అల్ట్రా ప్లాన్‌ కూడా ప్రవేశపెట్టింది. జెమిని స్పార్క్ వంటి టెక్నాలజీని ఎక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత టాప్ అల్ట్రా సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు 250 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించింది.

గూగుల్ సెర్చ్‌లో కీలక ఏఐ మార్పు :
గూగుల్ సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లో కీలక ఏఐ మార్పులను ప్రకటించింది. గత కొన్నేళ్లుగా సెర్చ్‌కు ఇదే అతిపెద్ద అప్‌గ్రేడ్. కొత్త జెమిని 3.5 మోడల్ గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా మారింది. యూజర్ల ప్రశ్నలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగల కొత్త ఏఐ ఆధారిత సెర్చ్ బాక్స్‌ను కూడా ప్రవేశపెట్టింది.

కొత్త ఏఐ సెర్చ్ బాక్స్ ఎలా పనిచేస్తుంది? :
గూగుల్ కొత్త సెర్చ్ బాక్స్ పాత సాధారణ సెర్చ్ బార్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ బాక్స్ యూజర్ల ప్రశ్నల ఆధారంగా డైనమిక్‌గా విస్తరిస్తుంది. మీరు టైప్ చేస్తున్నప్పుడు ఏఐ ఆధారిత సూచనలను అందిస్తుంది. ఈ ఫీచర్ కేవలం ఆటో-కంప్లీట్‌కు మాత్రమే పరిమితం కాదు.. యూజర్ల ప్రశ్నలను మెరుగుపరుస్తుంది. ఎవరైనా షార్ట్ డేటాతో సెర్చ్ చేసినా ఏఐ మరింత క్లియర్ డేటాను అందిస్తుంది.

టెక్స్ట్, ఫోటో, వీడియోల కోసం సెర్చ్ చేయొచ్చు :
గూగుల్ సెర్చ్‌ మల్టీమోడల్‌గా మారింది. ఈ కొత్త ఏఐ సెర్చ్ సిస్టమ్ ఇప్పుడు కేవలం టెక్స్ట్‌నే కాకుండా ఫోటోలు, వీడియోలు, ఫైళ్లను కూడా అర్థం చేసుకోగలదు. తద్వారా యూజర్లు మరింత కచ్చితమైన రిజల్ట్స్ వివిధ ఫార్మాట్లలో డేటాను పొందవచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా ఒక ఫొటోను అప్‌లోడ్ చేసి అదేంటో ప్రశ్న అడగవచ్చు. లేదా ఒక వీడియో ద్వారా డేటా కోసం సెర్చ్ చేయొచ్చు.

ఏఐ మోడ్, ఏఐ ఓవర్‌వ్యూలు విలీనం :
ఏఐ మోడ్, ఏఐ ఓవర్‌వ్యూలను విలీనం చేసినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా ట్రెడిషనల్ సెర్చ్ రిజల్ట్స్, ఏఐ జనరేటెడ్ రెస్పాన్స్ మధ్య యూజర్లు ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. పాత కన్వర్షన్ అలానే ఉంటుంది. ఇంకా లోతుగా రిలేటెడ్ డేటాను పొందవచ్చు. ఏఐ యూజర్లకు మరింత సంబంధిత లింకులు, సోర్సెస్ కూడా అందిస్తుందని గూగుల్ చెబుతోంది.

డెస్క్‌టాప్, మొబైల్ లోనూ ఏఐ సెర్చ్ ఆప్షన్ :
కొత్త ఏఐ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ డెస్క్‌టాప్, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

జెమిని యాప్‌లో కొత్త డిజైన్ :
గూగుల్ జెమిని యాప్ కోసం కొత్త డిజైన్‌ను కూడా అందిస్తోంది. జోష్ వుడ్‌వార్డ్ I/O 2026 ఈవెంట్‌లో ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టారు. కొత్త డిజైన్‌తో పాటు జెమిని యాప్‌కు అనేక కొత్త ఏఐ వాయిస్‌లు యాడ్ చేశారు. ముఖ్యంగా, ఈ వాయిస్‌లు విభిన్న భాషల్లో వినియోగదారులకు లోకల్ లాంగ్వేజీకి దగ్గరగా ఉంటాయి.

జెమినికి స్మార్ట్ ఏఐ ఏజెంట్లు :
జెమిని ఏఐ మరింత అడ్వాన్స్‌గా మారబోతోందని గూగుల్ ఐ/ఓ 2026లో ప్రకటించింది. జెమిని యాప్‌కు కొత్త ఏఐ ఏజెంట్లను అందించనున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వుడ్‌వార్డ్ ధృవీకరించారు. గూగుల్, జెమిని స్పార్క్ అనే కొత్త ఏజెంట్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా యూజర్లు కస్టమ్ వర్క్‌ఫ్లోలను క్రియేట్ చేసుకోవచ్చు. జెమిని ఇకపై కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు అనేక రకాల పనులను ఆటోమేట్ చేయగలదు.

ఆండ్రాయిడ్ XRతో ఏఐ గ్లాసెస్ ఆవిష్కరణ :
గూగుల్ ఐ/ఓ 2026లో ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ టెక్నాలజీని ఆవిష్కరించింది. రెండు రకాల ఏఐ-ఆధారిత స్మార్ట్‌గ్లాసెస్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్, శాంసంగ్ కలిసి ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సపోర్టు చేసేలా ఆడియో గ్లాసెస్‌ను ఫస్ట్ టైమ్ ప్రవేశపెట్టాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో డిస్‌ప్లే స్క్రీన్ ఉండదు.

మొత్తం డేటా ఏఐ రెస్పాండ్స్ ఇంటర్నల్ స్పీకర్‌ల ద్వారా యూజర్లకు అందుతాయి. ఈ గ్లాసెస్ పూర్తిగా ఆడియో ఆధారిత స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఇన్‌పుట్ కోసం కెమెరా, మైక్రోఫోన్ ఉన్నాయి. జెమిని ఏఐతో పనిచేస్తాయి. కళ్లద్దాల ఫ్రేమ్‌ ట్యాప్ చేయగానే ‘Hey Google’ అని వాయిస్ కమాండ్‌ ఇస్తే జెమినిని యాక్టివేట్ అవుతుంది.

ఈ స్మార్ట్ గ్లాసెస్ రిలీజ్ ఎప్పుడంటే? :
గూగుల్ ప్రకారం.. ఈ కొత్త ఏఐ గ్లాసెస్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో లాంచ్ కానున్నాయి. భవిష్యత్తులో, స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఈ స్మార్ట్ ఏఐ గ్లాసెస్ కూడా మార్కెట్లో కీలకంగా మారనున్నాయి.