Upcoming Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? నవంబర్‌లో 5 క్రేజీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే..!

Upcoming Smartphones November 2026 : నవంబర్ 2026లో భారత్‌లో షావోమీ 18 ప్రో, ఐక్యూ 16, మోటోరోలా సిగ్నేచర్ 27, వన్ ప్లస్ 16R, వివో X500 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ, ప్రాసెసర్, ఫీచర్ల వివరాలివే..

Upcoming Smartphones November 2026

  • నవంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర..
  • షావోమీ నుంచి వివో వరకు 5 అదిరిపోయే ఫోన్లు
  • 9000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్

Upcoming Smartphones November 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? నవంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో షావోమీ, ఐక్యూ, మోటోరోలా, వన్ ప్లస్, వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఇందులో నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అత్యంత ఆకర్షణీయమైన ఫోన్లు ఉండనున్నాయి.. ఇప్పటికే కొన్ని ఫోన్ల లాంచ్ వివరాలను కంపెనీలు ధృవీకరించగా, మరికొన్ని వివరాలు లీకులు అయ్యాయి.. ఇంతకీ రాబోయే ఆయా ఫోన్ల వివరాలేంటో ఓసారి చూద్దాం..

షావోమీ 18 ప్రో :
షావోమీ18 ప్రో నవంబర్‌లో రాబోతున్న ఫోన్లలో చాలా కీలకం.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026లో షావోమీ ఇండియా ప్రొడక్ట్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ గౌతమ్ బాత్రా ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ కానున్నట్లు వెల్లడించారు. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జనరేషన్ 6 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది..

ఐక్యూ 16 :
ఐక్యూ 16 కూడా త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. IMC 2026లో ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మార్యా ధృవీకరించారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జనరేషన్ 6 చిప్‌సెట్‌తో పాటు 8,400mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని అంచనా..

Read Also : Upcoming Cars in November 2026 : నవంబర్‌లో కార్ల జాతర.. రూ.10 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు 7 కొత్త మోడల్స్!

మోటోరోలా సిగ్నేచర్ 27 :
మోటోరోలా కూడా ప్రీమియం ఫోన్ సిగ్నేచర్ 27ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులోనూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జనరేషన్ 6 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 16R :
వన్‌ప్లస్ 16తో పాటు 16Rను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్, 9,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం..

వివో X500 ప్రో మ్యాక్స్ :
ఈ వివో ప్రో ఫోన్ కూడా నవంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో డైమన్షిటీ 9600 ప్రో చిప్‌సెట్, 6.36 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అయితే, లాంచ్ తేదీలు, పూర్తి స్పెసిఫికేషన్లపై కంపెనీల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.