Motorola G86 Power 5G : ఫ్లిప్‌కార్ట్ పండగ ఆఫర్లు.. రూ. 20వేల మోటోరోలా 5G ఫోన్ ఇప్పుడు రూ.17,999కే..
Motorola G86 Power 5G : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటోరోలా జీ86 పవర్ 5జీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.. రూ.17,999 ప్రారంభ ధర, బ్యాంక్ ఆఫర్‌తో రూ.2,900 వరకు తగ్గింపు పొందవచ్చు. 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫీచర్ల పూర్తి వివరాలివే..
Motorola G86 Power 5G
- మోటోరోలా 50MP డ్యూయల్ కెమెరా, 6720mAh బ్యాటరీ
- ఈ ఫోన్ 53 గంటల వరకు బ్యాకప్ అందిస్తుంది
- మోటో ఏఐతో పాటు అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది
- ఈ ఫోన్ IP68+IP69 రేటింగ్‌తో వస్తుంది
Motorola G86 Power 5G : మోటోరోలా ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? భారీ బ్యాటరీ, మంచి కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు తక్కువ ధరకే కొనాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్.. మోటోరోలా G86 పవర్ 5జీ అద్భుతమైన ఆప్షన్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్ ద్వారా మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..
ధర, డిస్కౌంట్లు :
మోటోరోలా జీ86 పవర్ 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.19,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. తద్వారా రూ.2వేలు డిస్కౌంట్‌తో ఫోన్ ధర రూ.17,999కు తగ్గింది..
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. మరో రూ.900 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లను కలిపి అసలు ధరతో పోలిస్తే గరిష్ఠంగా రూ.2,900 వరకు ఆదా చేయవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
మోటోరోలా జీ86 పవర్ 5జీ ఫీచర్లు :
ఈ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ హెచ్డీ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. IP68, IP69 రేటింగ్స్ అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. మోటో ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ ఈ ఫోన్‌కు మరో స్పెషల్ అట్రాక్షన్.. ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మొత్తంగా మంచి బ్యాటరీ, కెమెరా, పర్ఫార్మెన్స్ కోరుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది..
