Teenage Mastermind : మైక్రోసాఫ్ట్, శాంసంగ్ సీక్రెట్స్ హ్యాక్ చేసిన 16ఏళ్ల టీనేజర్.. మాస్టర్ మైండ్ ఇతడే..!

Teenage Mastermind : ఒక 16ఏళ్ల టీనేజర్.. ప్రపంచ టెక్ దిగ్గజాలను ముప్పు తిప్పులు పెడుతున్నాడు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ సహా ఐదు దిగ్గజ టెక్ కంపెనీల కీలక రహాస్యాలను హ్యాక్ చేశాడు. అసలు

Teenage Mastermind : ఒక 16ఏళ్ల టీనేజర్.. ప్రపంచ టెక్ దిగ్గజాలను ముప్పు తిప్పులు పెడుతున్నాడు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ సహా ఐదు దిగ్గజ టెక్ కంపెనీల కీలక రహాస్యాలను హ్యాక్ చేశాడు. అసలు ఈ హ్యాకింగ్ చేసిందని ఎవరో కనిపెట్టేందుకు సైబర్ నిపుణులను బాధిత కంపెనీలు ఆశ్రయించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాంసంగ్, మైక్రోసాఫ్ట్, యుబిసాఫ్ట్, ఎన్వైదా, ఓక్తా టెక్ కంపెనీల రహాస్యాలను హ్యాక్ చేసింది ఒక టీనేజర్ అని తెలిసి దిగ్గజ కంపెనీలు ఒక్కసారిగా షాకింగ్ గురయ్యాయి.

అంతేకాదు.. ఈ హ్యాకింగ్ గ్రూపుకు మాస్టర్ మైండ్ కూడా ఈ 16ఏళ్ల టీనేజరేనట.. ల్యాప్సస్‌$ (Lapsus$) అనే హ్యాకింగ్ గ్రూపు ద్వారా హ్యాక్ చేసినట్టు సైబర్ నిపుణులు తేల్చేశారు. ఈ హ్యాకింగ్ వ్యవహారం వెనుక పెద్ద హ్యాకింగ్ గ్రూపు ఉందని గుర్తించారు. అయితే ఈ గ్రూపుకు సూత్రధారిగా టీనేజర్ వ్యవహరిస్తున్నాడని తెలిసి నివ్వెరపోయారు. ఇంతకీ ఈ కంపెనీల డేటాను ఎందుకు హ్యాకింగ్‌ ఎందుకు చేశారు అనేదానిపై క్లారిటీ లేదు.

మాస్టర్ మైండ్ హ్యాకింగ్ టీనేజర్ ఎవరో సైబర్ నిపుణులు కనిపెట్టేశారు. ఇంటర్నల్ ఇన్విస్టిగేషన్ నిర్వహించగా.. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ ప్రాంతంలో ఆ టీనేజర్‌ తన తల్లితో కలిసి ఉంటున్నట్లుగా గుర్తించారు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలకు చెందిన 15వేల మంది క్లయింట్ల డేటా ప్రస్తుతం ఈ టీనేజర్ చేతిలోనే ఉంది. క్లయింట్లకు సంబంధించిన పూర్తి డేటా బహిర్గతం కావడంపై ఆందోళన నెలకొంది. హ్యాకింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది, దీని వెనుక మరి ఏదైనా సైబర్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

Teenage Mastermind A Teenage Mastermind Is Behind Lapsus$ Attacks That Affected Microsoft, Samsung

ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ టీనేజర్ ‘వైట్’, ‘బ్రీచ్‌బేస్’ అనే మారు పేర్లతో హ్యాకింగ్‌ చేస్తున్నాడని గుర్తించారు. అతడు హ్యాకింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్న 7 అకౌంట్‌లను సైబర్‌ నిపుణులు గుర్తించారు. ఒక అకౌంట్ బ్రెజిల్‌కు చెందిన యువకుడిదిగా గుర్తించారు. దిగ్గజ కంపెనీల డేటాను ఎందుకు హ్యాక్‌ చేస్తున్నారు.

అందువల్ల వారికి కలిగే ప్రయోజనం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు సైబర్ నిపుణులు. టీనేజర్‌కు హ్యాకింగ్‌లో నైపుణ్యంగా ఎక్కువగా ఉందని సైబర్ నిపుణుల్లో ఒకరు వెల్లడించారు. ల్యాప్సస్‌$ అనే హ్యాకింగ్ గ్రూప్‌ కారణంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓక్తాకు చెందిన 366మంది క్లయింట్లు తీవ్రంగా నష్టపోయారు. ఓక్తా కంపెనీ షేర్లు ఒక్కసారిగా 9శాతం క్షీణించాయి. కంపెనీ కార్యకాలపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఈ దిగ్గజ కంపెనీల డేటాను హ్యాక్ చేయడమే కాకుండా ఆ డేటాను సురక్షితంగా రిలీజ్ చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులను డిమాండ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సైబర్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీనేజర్‌ నివసించే ప్రాంతాన్ని సైబర్ నిపుణులు గుర్తించారు. కానీ, అతడు ఎక్కడ ఉన్నాడో మాత్రం గుర్తించలేకపోయారు. ఇప్పుడా టీనేజర్ కు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు సైబర్ నిపుణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Read Also : Cyberabad She Teams : సోషల్ మీడియాపై షీ టీమ్స్ నిఘా-50 మందికి ఫస్ట్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు