Acer Sospiro A15 : ఒక ఫోన్.. రెండు డిస్‌ప్లేలు.. కిర్రాక్ ఫీచర్లతో కొత్త ఏసర్ సోస్పిరో A15 వచ్చేసింది.. కొనాలా? వద్దా?

Acer Sospiro A15 : ఏసర్ నుంచి సరికొత్త డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ వచ్చేసింది. కంపెనీ బ్యాక్ సైడ్ 1.88-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 64ఎంపీ కెమెరా, 5000mAh బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంది. పూర్తి ఫీచర్, ధర వివరాలివే..

Acer Sospiro A15

  • ఏసర్ సోస్పిరో A15 6.67-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే
  • ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్‌లో యునిసోక్ టి615 చిప్‌సెట్‌
  • ఏసర్ సోస్పిరో ఎ15 64ఎంపీ ఏఐ కెమెరా కూడా ఉంది

Acer Sospiro A15 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీ ఏసర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ చేసింది. కంపెనీ లేటెస్ట్ ఫోన్ ఏసర్ సోస్పిరో A15 మోడల్ 64MP కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో HD+ IPS డిస్‌ప్లే ఉంది.

యూనిసోక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అంతేకాదు.. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో భారీ 5000mAh బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు (Acer Sospiro A15) సపోర్టు ఇస్తుంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఏసర్ సోస్పిరో A15 ఫోన్ ధర
కంపెనీ ఏసర్ సోస్పిరో A15ను యూఎస్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫోన్ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ ఏసర్ సోస్పిరో ఎ15 ఫోన్ ఆరెంజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఏసర్ సోస్పిరో A15 ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఏసర్ సోస్పిరో A15లో 120Hz రిఫ్రెష్ రేట్ వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో 6.67-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ బ్యాక్ డిస్‌ప్లే 1.88-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేతో వస్తుంది. నోటిఫికేషన్లు చూడటం, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ కంట్రోలింగ్, సెల్ఫీల కోసం వ్యూఫైండర్‌గా వాడొచ్చు. మెయిన్ కెమెరా ద్వారా చూస్తూ సెల్ఫీలు తీసుకోవచ్చు.

Read Also : Xiaomi Mi 10T 5G : 5000mAh బ్యాటరీతో షావోమీ ఫోన్‌ రూ. 21,000 తక్కువకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?

ఈ ఫోన్‌లో ప్రాసెసింగ్ కోసం యునిసోక్ T615 చిప్‌సెట్‌ ఉంది. 5జీ కనెక్టివిటీతో పాటు 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 14జీబీ వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 1టీబీ వరకు కూడా విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది.

ఏసర్ సోస్పిరో ఎ15లో 64ఎంపీ ఏఐ కెమెరా ఉంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ లెన్స్‌, సెకండరీ సెన్సార్ కూడా ఉంది. ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో భారీ 5000mAh బ్యాటరీ ఉంది. కంపెనీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ 5.0, NFC, GPS, VoLTE, ViLTE, FM రేడియో, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.