Xiaomi Mi 10T 5G : 5000mAh బ్యాటరీతో షావోమీ ఫోన్ రూ. 21,000 తక్కువకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Xiaomi Mi 10T 5G : షావోమీ ఎంఐ 10టీ 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 21వేలు తక్కువకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోండి.

Xiaomi Mi 10T 5G : షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. షావోమీ ఎంఐ సిరీస్ మార్కెట్లో బాగా పాపులర్ మోడల్. ఈ సిరీస్‌లో కంపెనీ అనేక అద్భుతమైన ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని మోడల్ ధరలు భారీగా తగ్గాయి.

ఇందులో షావోమీ Mi 10టీ 5జీ ఫోన్ కూడా ధర తగ్గింది. ఈ ఫోన్ భారీ 5000mAh బ్యాటరీ, 64ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. ప్రస్తుతం ఈ షావోమీ ఎంఐ ఫోన్ ధర సుమారుగా రూ. 22వేలు తగ్గింది. ఇంతకీ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎంఐ 10T 5జీ ధర డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో షావోమీ ఎంఐ 10టీ 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 42,999లో లాంచ్ కాగా ఇప్పుడు రూ. 23,399 తగ్గింపు ధరకు లభిస్తోంది. దాంతో రూ. 19,000కు పైగా నేరుగా తగ్గింపు పొందవచ్చు. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు.

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ :
ఎంఐ 10T 5జీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1,170 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 22,229 నుంచి రూ. 21,370 తక్కువకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

షావోమీ ఎంఐ 10టీ స్పెసిఫికేషన్లు :
షావోమీ ఎంఐ 10టీ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,440 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ వరకు ర్యామ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ సెకండరీ కెమెరా, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియోల కోసం ఎంఐ 10T 20ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

షావోమీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 165.1x76.4x9.33mm, బరువు 216 గ్రాములు ఉంటుంది.
