Xiaomi Mi 10T 5G : 5000mAh బ్యాటరీతో షావోమీ ఫోన్‌ రూ. 21,000 తక్కువకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?

Xiaomi Mi 10T 5G : షావోమీ ఎంఐ 10టీ 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 21వేలు తక్కువకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోండి.

1/7
Xiaomi Mi 10T 5G : షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. షావోమీ ఎంఐ సిరీస్ మార్కెట్లో బాగా పాపులర్ మోడల్. ఈ సిరీస్‌లో కంపెనీ అనేక అద్భుతమైన ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని మోడల్ ధరలు భారీగా తగ్గాయి.
2/7
ఇందులో షావోమీ Mi 10టీ 5జీ ఫోన్ కూడా ధర తగ్గింది. ఈ ఫోన్ భారీ 5000mAh బ్యాటరీ, 64ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. ప్రస్తుతం ఈ షావోమీ ఎంఐ ఫోన్ ధర సుమారుగా రూ. 22వేలు తగ్గింది. ఇంతకీ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఎంఐ 10T 5జీ ధర డిస్కౌంట్ : ఫ్లిప్‌కార్ట్‌లో షావోమీ ఎంఐ 10టీ 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 42,999లో లాంచ్ కాగా ఇప్పుడు రూ. 23,399 తగ్గింపు ధరకు లభిస్తోంది. దాంతో రూ. 19,000కు పైగా నేరుగా తగ్గింపు పొందవచ్చు. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు.
4/7
బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ : ఎంఐ 10T 5జీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1,170 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 22,229 నుంచి రూ. 21,370 తక్కువకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
5/7
షావోమీ ఎంఐ 10టీ స్పెసిఫికేషన్లు : షావోమీ ఎంఐ 10టీ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,440 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ వరకు ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
6/7
64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ సెకండరీ కెమెరా, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియోల కోసం ఎంఐ 10T 20ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
7/7
షావోమీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 165.1x76.4x9.33mm, బరువు 216 గ్రాములు ఉంటుంది.