×
Ad

Australia AI Tools Ban : టీనేజర్లపై AI ప్రభావం.. 16 ఏళ్లలోపు పిల్లలకు ChatGPT, Gemini బ్యాన్, ఆస్ట్రేలియా కఠిన చట్టం?!

Australia AI Tools Ban : ఏఐ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి టీనేజర్లను రక్షించేందుకు ఆస్ట్రేలియా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా, ఏఐ మోడల్‌లపై దృష్టి సారించింది. మార్చి 9 నాటికి ఏఐ సేవలకు ఏజ్ వెరిఫికేషన్ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Australia AI Tools Ban (Image Source: AI generated/ Google Gemini)

  • టీనేజర్ల భద్రత కోసం త్వరలో ఆస్ట్రేలియా కఠిన నిబంధనలు
  • 16 ఏళ్లలోపు పిల్లలకు AI టూల్స్ నిషేధంపై యోచన
  • సోషల్ మీడియా నిషేధం తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలకు ఏఐ టూల్స్ బ్లాక్

Australia AI Tools Ban : ప్రపంచమంతా ఏఐ ప్రభావంతో ఒక్కసారిగా మారిపోయింది. రానురాను ఈ ఏఐ ప్రభావం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా టీనేజర్లు ఏఐ ప్రభావంతో వచ్చే పెనుమార్పులతో ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. ఈ నేపథ్యంలో టీనేజర్ల రక్షణ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలు చేపడుతోంది.

దేశంలో ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించగా తాజాగా ఇప్పుడు ఏఐ వంటి టూల్స్‌పై కూడా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. అందులోనూ టీనేజర్ల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి ఈ టూల్స్ వినియోగంతో పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన నిబంధనలతో ఆస్ట్రేలియా ముందుకు వస్తోంది.

గతంలో 16 ఏళ్లలోపు టీనేజర్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగాన్ని నిషేధించింది. ఇప్పుడు ఏఐ మోడల్స్ విషయంలో కూడా అదే తరహాలో నిబంధనల అమలుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాలోని ఇంటర్నెట్ రెగ్యులేటర్ యాప్ స్టోర్‌లు, సెర్చ్ ఇంజన్‌లను వినియోగదారుల వయస్సును ధృవీకరించడంలో విఫలమైన అన్ని ఏఐ సర్వీసులను నిషేధిస్తామని హెచ్చరించింది.

వచ్చే వారం గడువు ముగిసేలోపు కొత్త వయోపరిమితి నిబంధనలను అమలు చేయాలని చాలా ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు బహిరంగంగా ప్రకటించలేదంటూ రాయిటర్స్ నివేదిక తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

Read Also : SIM Swap Scam : ఇరాన్–ఇజ్రాయెల్ వార్.. ఒక్క డీటెయిల్ ఇచ్చినా ఖాతా ఖాళీ! ‘సిమ్ స్వాప్ స్కామ్‌’పై దుబాయ్ పోలీసులు వార్నింగ్

మార్చి 9 నుంచి ఏఐ సేవలకు ఏజ్ వెరిఫికేషన్ :

నివేదిక ప్రకారం.. మార్చి 9 నుంచి (ChatGPT) వంటి ఏఐ చాట్‌బాట్‌లతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులను తీవ్ర హింస, సెల్ఫ్ హామ్, మానసిక రుగ్మతలు, అశ్లీలతకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా నియంత్రించాలని ఆస్ట్రేలియా eSafety కమిషనర్ తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు? :
కొత్త నిబంధనలను పాటించని వారందరికీ 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లపై మాత్రమే కాకుండా యాప్ స్టోర్‌లు, సెర్చ్ ఇంజన్‌ల వంటి గేట్ కీపర్ సర్వీసులపై కూడా ఉంటుందని రెగ్యులేటర్ పేర్కొంది.

రాయిటర్స్ రివ్యూ ప్రకారం.. 50 టెక్స్ట్-ఆధారిత ఏఐ టూల్స్ 9 మాత్రమే ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ అందిస్తున్నాయి. ఈ లిస్టులో మిగిలిన 11 టూల్స్ బ్లాంకెట్ కంటెంట్ ఫిల్టర్‌లను ఉపయోగించాయి. ఆస్ట్రేలియన్ యూజర్లు పూర్తిగా బ్లాక్ చేయాలని ప్లాన్ చేశాయి. దాదాపు 30 ఏఐ టూల్స్ ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ అందుబాటులో లేదు.

ప్రస్తుతం చాట్ జీపీటీ, క్లాడ్, ఆంత్రోపిక్ వంటి ప్రముఖ ఏఐ మోడల్స్ ఇప్పటికే తమ యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ఫిల్టర్‌లు, ఏజ్ కంట్రోల్స్ ప్రవేశపెట్టడం మొదలుపెట్టేశాయి. ఏఐ టూల్స్ ప్లాట్‌ఫారమ్‌లు అందించే కంపెనీలు కచ్చితమైన నిబంధనలను పాటిస్తేనే దేశంలోనే ఉంటారు లేదంటే ఆస్ట్రేలియన్ మార్కెట్‌కు వీడ్కోలు చెప్పాల్సిందే అంటున్నారు.