Ai Plus Nova 2 Power 5G : సూపర్ ఫీచర్లు బ్రో.. కొత్త ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5G అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?
Ai Plus Nova 2 Power 5G : ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర రూ. 16,699కు కొనేసుకోవచ్చు. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
- Sreehari A
- Published on- September 20, 2026 / 09:45 PM IST
Ai Plus Nova 2 Power 5G
- ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్
- 8GB ర్యామ్, భారీ 7000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు
- స్టోరేజీ కోసం 1TB వరకు మైక్రో SD కార్డ్ ఆప్షన్
Ai Plus Nova 2 Power 5G : అద్భుతమైన ఏఐ ఫీచర్లతో కొత్త ఏఐ ప్లస్ నోవా 5జీ ఫోన్ వచ్చేసింది. భారతీయ కంపెనీ నుంచి నోవా 2 సిరీస్‌లో ఇదే సరికొత్త ఫోన్. ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, భారీ బ్యాటరీ ఉన్నాయి. భారత మార్కెట్లో ఏఐ+ నోవా 2 పవర్ 5జీ ధర, ముఖ్య ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో ధర ఎంతంటే? :
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర రూ. 16,699కు లభించనుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 17,999కు వస్తుంది. ఈ సేల్ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ బ్లూ ఫ్యూజన్, బ్లూ గోల్డ్ ఫ్యూజన్, డీప్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 6.75-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ డిజైన్‌తో వస్తుంది. 8GB ర్యామ్, ఆక్టా-కోర్ చిప్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 128GB స్టోరేజ్ కూడా ఉంది. స్టోరేజీ పెంచుకోవాలంటే (1TB వరకు) ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్‌తో వస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. :
ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ 48MP మెయిన్ కెమెరా ఉంది. 30fps వద్ద 2K వీడియోను రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో భారీ 7000mAh బ్యాటరీని అమర్చింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP65 రేటింగ్ అందించారు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5జీ SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.4, GPS/GLONASS/Beidou, USB టైప్-సి వంటి ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌కు సపోర్ట్ చేస్తుంది.
