Airtel Roaming Plans
Airtel Roaming Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను పెంచింది. విదేశాలకు వెళ్లే ఎయిర్‌టెల్ యూజర్లకు వినియోగదారులకు భారంగా మారుతుంది. గతంలో రూ.4వేల విలువైన ఈ ప్యాక్ ఇప్పుడు రూ.4,999కి చేరుకుంది.
ఈ మార్పుతో దాదాపు 25 శాతం ధర పెరిగింది. 2026లో భారతీయ టెలికాం ఆపరేటర్ చేసిన మొదటి మెయిన్ టారిఫ్ పెంపు కూడా ఇదే. ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్, ఇతర థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌లలో సవరించిన ధరలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ రోమింగ్ ప్లాన్ ధర పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఎయిర్‌టెల్ రూ. 4,999 ప్లాన్‌పై అంతర్జాతీయ బెనిఫిట్స్ :
అంతర్జాతీయ రోమింగ్ కింద రూ. 4,999 గ్లోబల్ ప్యాక్ సాధారణ విదేశీ ప్రయాణాలకు అందుబాటులో ఉంది. వినియోగదారులు విదేశాలలో రోమింగ్ ప్లాన్ ద్వారా 5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్‌లో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ కోసం 100 నిమిషాలు ఉన్నాయి. ఈ వాయిస్ కాల్స్ భారత్ లేదా విదేశాల్లో స్థానిక నంబర్‌లకు కూడా కాల్స్ చేయవచ్చు.
100 అవుట్‌గోయింగ్ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అంతర్జాతీయ రోమింగ్ సమయంలో ఇన్‌కమింగ్ SMS బెనిఫిట్స్ ఉచితం. ఈ గ్లోబల్ ప్యాక్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఒక ఏడాదిలో అనేకసార్లు విదేశాలకు వెళ్లే వారికి అద్భుతంగా ఉంటుంది.
ఎయిర్‌టెల్ రూ. 4,999 ప్లాన్ : దేశీయ బెనిఫిట్స్ :
స్వదేశీ, గ్లోబల్ ప్యాక్ స్టాండర్డ్ ప్రీపెయిడ్ బెనిఫిట్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాను అందుకుంటారు. ఈ ప్యాక్ దేశీయ వినియోగానికి రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
రీఛార్జ్ చేశాక యూజర్లు విదేశాలకు వెళ్తే అంతర్జాతీయ రోమింగ్ బెనిఫిట్స్ ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. నిబంధనల ప్రకారం.. ప్యాక్ రెన్యువల్ కాకముందే వ్యాలిడిటీ వ్యవధి ముగిసిన తర్వాత డేటా, కాలింగ్, మెసేజింగ్ సర్వీసులు నిలిచిపోతాయి.
రూ. 4,999 ప్లాన్ ధరల పెంపు :
రూ.4,999 ప్రీపెయిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ధరపై ఎయిర్‌టెల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, భవిష్యత్తులో టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్‌ల కోసం రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రొమింగ్ ప్లాన్ ధర ఇప్పటికే ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది. ఓసారి చెక్ చేసుకోండి.