Airtel Broadband Plan : ఇదే అసలు పండగ ఆఫర్! ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్‌లో 22+ OTTలు ఫ్రీ… ధర చూస్తే మైండ్ బ్లో!

Airtel Broadband Plan : మీ ఇంటి కోసం సరసమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్ బెస్ట్. ఈ ప్లాన్ డేటాతో పాటు లైవ్ టీవీ 22కు పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ అందిస్తుంది.

Airtel Broadband Plan ( Image Credit : AI )

  • ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం చౌకైన బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
  • రూ. 699కే కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, 22కు పైగా ఓటీటీ బెనిఫిట్స్
  • 40Mbps స్పీడ్, నెలకు 1TB డేటా, ఫైబర్ ప్లాన్ 3.3TB డేటా

Airtel Broadband Plan : మీరు ఇంట్లో కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటున్నారా? అయితే, ఏ బ్రాడ్‌బ్యాండ్ తీసుకుంటే బెటరా? అని ఆలోచిస్తున్నారా? ఎయిర్‌టెల్ తక్కువ ధరకే బెస్ట్ బెనిఫిట్స్ అందించే ప్లాన్లు ఏంటో ముందుగా తెలుసుకోవాలి.

కొత్త బ్రాడ్‌బ్యాండ్ కోసం చూస్తుంటే మీకోసం ఎయిర్‌టెల్ సరసమైన ప్లాన్ ఆఫర్ చేస్తోంది. కేవలం డేటానే కాకుండా లైవ్ టీవీ ఛానెళ్లు, అన్నింటికన్నా ముఖ్యంగా, OTT బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 699కు పొందవచ్చు. ఈ ప్లాన్ అందించే OTT ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ అందించే అత్యంత చౌకైన రూ. 699 ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లో విడిగా జీఎస్టీ చెల్లించాలి. 18శాతం తర్వాత ఈ ప్లాన్ ధర మీకు రూ. 824.82 అవుతుంది. ఒకవేళ మీరు ఎయిర్‌టెల్ లేదా జియో ప్లాన్ తీసుకున్నా 18శాతం జీఎస్టీ యాడ్ అవుతుంది.

Read Also : Samsung Mini LED TV : ఇంట్లోనే థియేటర్ ఫీల్! శాంసంగ్ కొత్త AI మినీ LED టీవీలు వచ్చేశాయి.. ధర మాత్రం నమ్మలేరు!

ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్ :
టెలికాం టాక్ ప్రకారం.. ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్ 40Mbps స్పీడ్, నెలకు 1TB డేటాను అందిస్తుంది. ఎయిర్‌ఫైబర్ ప్లాన్ 1TB డేటాను అందిస్తుండగా ఫైబర్ ప్లాన్ 3.3TB డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్, సన్‌నెక్స్ట్, సోనీ లివ్, ఆహా, చౌపాల్ ఈరోస్‌నౌ వంటి OTT బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. OTTతో పాటు ఈ ప్లాన్ 350కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు కూడా యాక్సెస్‌ను అందిస్తుంది.

హై-స్పీడ్ ప్లాన్లు :
మీకు 40Mbps స్పీడ్ సరిపోకపోతే కంపెనీ మీ కోసం రూ. 799 ధరతో 100Mbps ప్లాన్‌ను కూడా అందిస్తోంది. జీఎస్టీ తర్వాత, ఈ ప్లాన్ ధర రూ. 942.82గా ఉంటుంది. ఈ ప్లాన్‌లో OTT బెనిఫిట్స్ లేవు. OTT బెనిఫిట్స్ పొందాలంటే, మీరు రూ. 899 ప్లాన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.