Airtel Prepaid Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్ ఇదిగో.. అన్ లిమిటెడ్ 5G హైస్పీడ్ డేటా..!

Airtel Prepaid Plan : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా, కాల్స్, ఫ్రీ అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Airtel Roaming Plan

Airtel Prepaid Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్ లతో విసిగిపోయారా? దేశీయ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ (Airtel Prepaid Plan) కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది.

Read Also : Best Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి? రూ.25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ :
రూ.1,199 ప్లాన్‌లో యూజర్లు రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. మొత్తం 210GB డేటా లభిస్తుంది. అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లలో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో లోకల్, నేషనల్ మెసేజింగ్ కోసం రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా  ఉన్నాయి.

అన్‌లిమిటెడ్ 5G డేటా :
కొత్త రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5G డేటాతో వస్తుంది. యూజర్లు డేటా లిమిట్ విషయంలో ఆందోళన అవసరం ఉండదు. అల్ట్రా-ఫాస్ట్ స్పీడ్ అందిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ లైట్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ :
ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ 84 రోజుల ఫ్రీ అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. తద్వారా యూజర్లు OTT కంటెంట్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మూవీలు, వెబ్ సిరీస్‌లు చూడవచ్చు.

ప్రతి నెలా రీఛార్జ్ అవసరం లేకుండా డేటా, ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే యూజర్లకు ఇదే బెస్ట్ ప్లాన్. గేమర్స్, స్ట్రీమర్లు లేదా రిమోట్ వర్కర్లు ప్రతిరోజూ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీ అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 399 బ్లాక్ ప్లాన్ ల్యాండ్‌లైన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా 10Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది.

Read Also : EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌ వడ్డీ రేటుపై కేంద్రం కీలక ప్రకటన.. ఈసారి ఎంతంటే?

ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) ప్రకారం..  డెయిలీ కోటా వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఆపై ఇంటర్నెట్ స్పీడ్ 1Mbpsకి తగ్గుతుంది.