Best Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి? రూ.25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Smartphones : రూ. 25వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? వివో T4 5G నుంచి నథింగ్ ఫోన్ 3a వరకు ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి.

Best Smartphones
Best Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇది బెస్ట్ టైమ్.. రూ. 20 వేల నుంచి రూ. 25 వేల లోపు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్లలో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన కెమెరా సెటప్‌తో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రియల్‌మి 13 ప్రో ప్లస్ 5జీ నుంచి నథింగ్ ఫోన్ 3a వరకు ఫోన్లలో ఏ ఫోన్ కొంటారో డిసైడ్ చేసుకోండి..
Read Also : Apple iPhone 13 : ఆఫర్ అదుర్స్.. ఐఫోన్ 13పై ఖతర్నాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనడం బెటర్..!
రియల్‌మి 13 ప్రో ప్లస్ 5G :
రియల్‌మి ఫోన్ రూ. 22,999కు అమ్మకానికి ఉంది. 5200mAh బ్యాటరీతో వస్తుంది. 50MPతో రెండు కెమెరాలు, ఫొటోలు, 8MPతో మూడు కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. డిస్‌ప్లే 6.70 అంగుళాలు ఉంటుంది.
పోకో X7 ప్రో 5G :
ఈ పోకో ఫోన్ (Best Smartphones) ప్రారంభ ధర రూ. 23,999 నుంచి అందుబాటులో ఉంది. 6.73-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
పవర్ కోసం 6550mAh బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+8MP కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 20MP కెమెరా కలిగి ఉంది.
వివో T4 5G :
ఈ వివో ఫోన్ సరైన ఆప్షన్ కావచ్చు. డిస్‌ప్లే 6.77 అంగుళాలు. 1080 రిజల్యూషన్‌తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 7300mAh ఉంటుంది.
అదే సమయంలో, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగి ఉంది. కెమెరా 50MP+2MPతో పాటు ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. ధర రూ. 21,470 నుంచి అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 3a :
నథింగ్ ఫోన్ 3a ఫోన్ (Best Smartphones) ధర రూ. 24999 నుంచి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ నథింగ్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఫోన్ డిస్‌ప్లే 6.77 అంగుళాలతో వస్తుంది.
8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. పవర్ విషయానికి వస్తే.. ఈ నథింగ్ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50MP, ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది.