Group Voice Chat : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై గ్రూపు చాట్‌లో మెసేజ్ టైపింగ్ అక్కర్లేదు.. ఓన్లీ మాట్లాడితే చాలు..!
Group Voice Chat : వాట్సాప్ కొత్త గ్రూపు వాయిస చాట్ ఫీచర్ వచ్చింది. మీరు గ్రూపు చాట్‌లో మెసేజ్ టైప్ చేయకుండా కేవలం మాట్లాడితే సరిపోతుంది.

Group Voice Chat
Group Voice Chat : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా యూజర్లు (Group Voice Chat) కలిగిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
చాటింగ్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేస్తోంది. గ్రూప్ చాట్స్ కోసం ప్లాట్‌ఫామ్ అధికారికంగా కొత్త వాయిస్ చాట్ టూల్ ప్రవేశపెట్టింది.
ఇకపై మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఈజీగా వాయిస్ చాట్ పంపుకోవచ్చు. ప్రత్యేకించి లాంగ్ మెసేజ్ టైప్ చేసి పంపనక్కర్లేదు.
నో టైపింగ్.. ఓన్లీ టాక్ :
గ్రూప్ చాట్‌లో లాంగ్ మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ టూల్ అందిస్తోంది.
ఇకపై యూజర్లు టైప్ చేయకుండానే నేరుగా గ్రూప్‌లో మాట్లాడొచ్చు. మెసేజ్ షేర్ చేయొచ్చు. ఈ టూల్ స్నేహితులు, ఫ్యామిలీ, సహోద్యోగులతో హ్యాండ్స్-ఫ్రీ, రియల్-టైమ్ వాయిస్ ఇంటరాక్షన్ పెంచుకోవచ్చు.
అన్ని గ్రూప్‌లకు వాయిస్ చాట్ ఫీచర్ :
ఈ వాయిస్ చాట్ (Group Voice Chat) టూల్ ఇప్పుడు ఇద్దరు నుంచి నలుగురు సభ్యుల స్మాల్ గ్రూపుల నుంచి 100 కన్నా ఎక్కువ మంది ఉండే భారీ కమ్యూనిటీల వరకు అన్ని రకాల గ్రూప్ సభ్యులకు అందుబాటులోకి వస్తోంది. మీ గ్రూప్‌లో ఎంత మంది ఉన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ లైవ్ గ్రూప్ వాయిస్ చాట్‌లో చేరవచ్చు.
ఆండ్రాయిడ్, iOS వెర్షన్ :
వాట్సాప్ ఈ ఫీచర్‌ను దశలవారీగా రిలీజ్ చేస్తోంది. అతి త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు సపోర్టు చేస్తుంది. అన్ని ఫోన్లలో సులభంగా యాక్సస్ చేయొచ్చు.
వాయిస్ నోట్స్ vs వాయిస్ చాట్ :
ట్రెడిషనల్ వాయిస్ నోట్స్ మాదిరిగా ఉండదు. వాయిస్‌చాట్‌లోకి నేరుగా యాక్టివ్ అవ్వొచ్చు. ప్రత్యేకించి ఏది అవసరం లేదు. రియల్-టైమ్ గ్రూప్ కాల్ మాదిరిగా ఉంటుంది. క్విక్ అప్‌డేట్స్, డిస్కషన్స్ లేదా ఫన్ కాన్వర్జేషన్స్‌కు బెస్ట్ టూల్.
Read Also : Apple iPhone 13 : ఆఫర్ అదుర్స్.. ఐఫోన్ 13పై ఖతర్నాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనడం బెటర్..!
ఈ కొత్త ఫీచర్‌తో డిజిటల్ కమ్యూనికేషన్ మరింత నేచురల్‌గా ఉంటుంది. వర్క్ టీమ్ లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేస్తున్నా గ్రూప్ వాయిస్ చాట్ టూల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.