Airtel Recharge Plans : రూ. 249 లేకున్నా డోంట్ వర్రీ.. ఎయిర్‌టెల్ 5 చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయిగా.. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్..!

Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ 5 చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 249 ప్లాన్ కన్నా బెటర్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.

Airtel Cheapest Plan

Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ అప్ డేట్.. ఇటీవలే చీపెస్ట్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ నిలిపివేసింది. రోజుకు 1.5 GB డేటాతో పాటు (Airtel Recharge Plans) అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS అందించింది.

ఇప్పుడు ప్లాన్ నిలిచిపోవడంతో కస్టమర్లు ఇతర రీఛార్జ్ ప్లాన్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఒకవేళ రూ. 299 ప్లాన్ తీసుకుంటే 1GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్‌ పొందవచ్చు. అలాగే, 28 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఇదే ప్లాన్ తరహాలో ఎయిర్ టెల్ అందించే మరెన్నో ప్లాన్లు కూడా ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు అన్నీ 28 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి.

ముఖ్యంగా, ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందించే ఐదు సరసమైన రీఛార్జ్ ప్లాన్ల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ :
ఈ ప్యాక్ 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, స్టేట్ రోమింగ్, 2GB డేటాను అందిస్తుంది. పూర్తి నెల పాటు కాకుండా బండిల్డ్ స్ట్రీమింగ్ సర్వీసులను పొందేవారికి ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా పొందవచ్చు.

Read Also : Upcoming Phones : కొత్త ఫోన్ కావాలా? సెప్టెంబర్‌లో రాబోయే క్రేజీ ఫోన్లు ఇవే.. ఐఫోన్ నుంచి ఒప్పో వరకు ఓసారి లుక్కేయండి..!

ఎయిర్‌టెల్ రూ. 219 ప్లాన్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ రూ.199 ప్లాన్ వంటి మరెన్నో బెనిఫిట్స్ అందిస్తుంది. 3GB డేటా మాత్రమే పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్ :
రోజువారీ డేటా లిమిట్స్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ కోరుకునే వారు ఇప్పుడు రూ.299 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఆసక్తిగల యూజర్లు రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS బెనిఫిట్స్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్ డేటాను పొందవచ్చు. రోజువారీ ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 349 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. అదనంగా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇంకా, వినియోగదారులు హెలోట్యూన్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 379 ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ఎక్కువ డేటా వాడే యూజర్లకు బెస్ట్. 30 రోజుల పాటు రోజుకు 2GB డేటా పొందవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, STD, స్టేట్ రోమింగ్ కాల్స్ కూడా పొందవచ్చు.