Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం రూ.299 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. కానీ రోజుకు డేటా ఎంతంటే?

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ వచ్చింది. రోజుకు 1GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMSలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే?

Airtel Recharge Plan

  • రూ..299కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రోజుకు 1GB డేటానే
  • పాత ప్లాన్ కొత్త లెక్కలు.. రూ.299 రీఛార్జ్‌తో 28GB డేటా
  • 28 రోజుల పాటు మొత్తం 28GB డేటా మాత్రమే

Airtel Recharge Plan : మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న వేళ టెలికాం కంపెనీలు తమ ప్లాన్లలోనూ భారీగా మార్పులు చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ (Airtel) రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. అయితే, ఈసారి మాత్రం పాత బెనిఫిట్స్ కాకుండా కొత్త లెక్కలతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఇందులో రోజువారీ డేటా విషయంలో కోత విధించి యూజర్లకు షాకిచ్చింది..

గతంలో ఎయిర్‌టెల్ రూ.299 రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 1.5GB డేటా అందించేది. అంటే.. 28 రోజుల వ్యాలిడిటీలో మొత్తం 42GB డేటా వాడుకోవచ్చు.. కానీ, ఇప్పుడు అదే ప్లాన్‌లో రోజుకు కేవలం 1GB డేటా మాత్రమే లభిస్తోంది. దీంతో 28 రోజుల పాటు మొత్తం 28GB డేటా మాత్రమే వాడుకోగలరు. అంటే గతంతో పోలిస్తే 14GB డేటా తగ్గిందన్నమాట..

అన్ లిమిటెడ్ కాల్స్, 10 SMS బెనిఫిట్స్ :
ఈ ప్లాన్‌లో మిగతా బెనిఫిట్స్ మాత్రం చాలా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. అలాగే, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS కూడా లభిస్తాయి. సాధారణ ఫోన్ కాల్స్ ఎక్కువగా చేసుకునే వారికి ఈ బెనిఫిట్ అద్భుతంగా ఉంటుంది.

Read Also : Samsung Galaxy S26 : ఇది కదా డిస్కౌంట్.. రూ.88వేల శాంసంగ్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే?

అదనపు బెనిఫిట్స్ కూడా :
ఇంకా ఈ ప్లాన్‌లో కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని వాల్యూ సుమారు రూ.4వేలు ఉంటుంది. అలాగే స్పామ్ కాల్స్, అనవసర మెసేజ్ నుంచి ప్రొటెక్షన్ కోసం సేఫ్ నెట్‌వర్క్ సదుపాయం, 30 రోజుల పాటు ఫ్రీ హెలోట్యూన్స్ పొందవచ్చు.

రూ.299 ప్లాన్ మళ్లీ రావడం ఎయిర్‌టెల్ కస్టమర్లకు రిలీఫ్ అనే చెప్పాలి.. కానీ, గతంలో అందించిన 1.5GB రోజువారీ డేటా ఇప్పుడు 1GBకి తగ్గడం మాత్రం కొందరికి నిరాశే.. రీఛార్జ్ చేసుకునే ముందు కొత్త బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి..