Amazon Black Friday Sale : వారెవ్వా.. ఇది కదా ఆఫర్ అంటే.. గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 10పై ధర భారీగా తగ్గింది. ఈ పిక్సెల్ ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 14వేలు తగ్గింపు అందిస్తోంది.
- Sreehari A
- Published On : November 29, 2025 / 02:45 PM IST
Amazon Black Friday Sale
Amazon Black Friday Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్, ఫ్యాషన్ హోం అప్లియన్సెస్ వంటి కేటగిరీలో భారీ డిస్కౌంట్లతో అందిస్తోంది.
గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10పై కిర్రాక్ (Amazon Black Friday Sale) డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పిక్సెల్ 10 ఫోన్ ప్రస్తుతం రూ. 14వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. కొత్తగా ఫోన్ అప్‌గ్రేడ్ ప్లాన్ చేసేవారికి అద్భుతమైన అవకాశం.
కొత్తగా లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే పిక్సెల్ 10 కొనుగోలు చేయడం బెటర్. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో పిక్సెల్ 10 ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరకు వచ్చింది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అమెజాన్ పిక్సెల్ 10పై రూ.11,349 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో పిక్సెల్ 10 ఫోన్ ధర రూ.68,650కి తగ్గింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 6.3-అంగుళాల OLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇంకా, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. హుడ్ కింద, పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,970mAh బ్యాటరీని అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10లో మాక్రో ఫోకస్‌తో కూడిన 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ 5× ఆప్టికల్ జూమ్ అందించే 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ పిక్సెల్ ఫోన్ సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా కలిగి ఉంది.
