×
Ad

Motorola Razr 60 Ultra : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా అల్ట్రా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డీల్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Razr 60 Ultra : అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్‌ సందర్భంగా మోటోరోలా రెజర్ 60 అల్ట్రా మడతబెట్టే ఫోన్ ఏకంగా రూ. 20వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Motorola Razr 60 Ultra

  • అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్‌లో పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు
  • స్మార్ట్‌ఫోన్‌లు సహా స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై మరిన్ని డీల్స్
  • మోటోరోలా రేజర్ 60 అల్ట్రా రూ. 20వేల కన్నా ఎక్కువ తగ్గింపు

Motorola Razr 60 Ultra : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా మోటోరోలా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.
ఆసక్తిగల యూజర్ల కోసం ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, కెమెరాలు, ఆడియో ప్రొడక్టులు వంటి అద్భుతమైన డీల్స్ అందిస్తోంది.

ప్రస్తుతం మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై కూడా అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రూ. 20వేల కన్నా తగ్గింపు ధరతో లభిస్తోంది. ఈ ఆకర్షణీయమై డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Gold Rate Today : వారెవ్వా.. బంగారం మళ్లీ తగ్గిందోచ్.. ఒక్కసారిగా గోల్డ్ ఢమాల్‌.. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంతంటే?

మోటోరోలా రెజర్ 60 అల్ట్రా అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా రూ.99,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ సమయంలో రూ.79,998కు లిస్ట్ అయింది. మరింత ఆదా కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 7.0-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ మెయిన్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కవర్ డిస్‌ప్లే 4.0 అంగుళాలతో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 16GB LPDDR5X ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 4,700mAh బ్యాటరీ కూడా ఉంటుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా రెజర్ 60 అల్ట్రాలో OISతో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. OIS, 2x ఆప్టికల్ జూమ్, 4K వీడియో రికార్డింగ్‌తో 30x AI సూపర్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది.