Amazon Great Freedom Sale 2026 : వావ్.. ఏంది భయ్యా ఆఫర్.. ఈ పిక్సెల్ ఫోన్ మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్..!
Amazon Great Freedom Sale 2026 : అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- August 12, 2026 / 01:12 PM IST
Amazon Great Freedom Sale 2026 : కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 65వేలు అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ 2026 అతి త్వరలో ముగియనుంది, మీరు ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవాలంటే ఇదే బెస్ట్ టైమ్..
డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో సరసమైన ధరలోనే లభిస్తోంది. ఇందులో టెన్సర్ G5 ప్రాసెసర్, 6.3-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ధర :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ అసలు ధర రూ. 79,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 68,850కే లభిస్తోంది. అంటే.. రూ. 11,149 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా అదనంగా రూ. 1,794.90 డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే, నెలకు సుమారు రూ. 2,421 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఎంచుకోవచ్చు. బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 38వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
ఈ ఫోన్ కొనాలా? వద్దా? :
క్లీన్ సాఫ్ట్‌వేర్, ఏఐ ఫీచర్లు, అద్భుతమైన కెమెరాతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కావాలంటే గూగుల్ పిక్సెల్ 10 అద్భుతమైన ఆప్షన్. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్, గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో వస్తుంది. 6.3-అంగుళాల డిస్‌ప్లే, స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందుకోగలదు.
కెమెరా లవర్స్ కోసం ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. 48MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్‌తో 10.5MP డ్యూయల్-పీడీ సెల్ఫీ షూటర్ కూడా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,970mAh బ్యాటరీ ఉంది. 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇతర ఫోన్లతో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ స్లో ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అంతగా బాగొదు. ఎల్టీపీఓ డిస్‌ప్లే కూడా లేదు. కేవలం పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ కన్నా క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, కెమెరా క్వాలిటీ, గూగుల్ ఏఐ ఫీచర్ల కోసమే అయితే ఈ పిక్సెల్ ఫోన్ మీరు కొనేసుకోవచ్చు.
