Amazon Great Freedom Sale 2026 : వావ్.. ఏంటి భయ్యా ఈ ఆఫర్! శాంసంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఎంతంటే?

Amazon Great Freedom Sale 2026 : శాంసంగ్ గెలాక్సీ ఎ56 5జీ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ అసలు ధర నుంచి ఏకంగా రూన.10వేలు తగ్గింపు పొందింది. ఈ అదిరిపోయే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

1/7
Amazon Great Freedom Sale 2026 : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఆఫర్.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ సహా వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. శాంసంగ్ గెలాక్సీ A56 ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తోంది.
2/7
నేరుగా డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, కార్డు ఆఫర్లతో కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లే, శాంసంగ్ ఎక్సినోస్ 1580 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. అమెజాన్‌లో గెలాక్సీ A56 5జీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
శాంసంగ్ గెలాక్సీ A56 5జీ అమెజాన్ డీల్ : శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ రూ. 41,999 ధరతో లాంచ్ కాగా ప్రస్తుతం రూ. 10వేలు డైరెక్ట్ డిస్కౌంట్‌తో రూ. 31,999కే లభిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుతో ఈ శాంసంగ్ ఫోన్ ఈఎంఐ వడ్డీలపై రూ. 2,511 వరకు సేవ్ చేసుకోవచ్చు. రూ. 1,125 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి రూ. 30,350 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
4/7
ఈ శాంసంగ్ ఫోన్ కొనాలా? వద్దా? : శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్‌ 1,200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు. డిస్‌ప్లేపై గీతలు పడకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్ట్ చేస్తుంది.
5/7
ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. IP67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 4 nm ఆర్కిటెక్చర్‌పై శాంసంగ్ ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 6 జనరేషన్స్ OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.
6/7
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో OISతో 50MP మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా సిస్టమ్ 4K రిజల్యూషన్ వరకు వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.
7/7
అదే సమయంలో ఇంటర్నల్ గెలాక్సీ ఏఐ ఎడిటింగ్ టూల్స్ ఫొటోలను అప్ గ్రేడ్ చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్పెసిఫికేషన్లన్నింటినీ దాదాపు రూ. 30వేల ధరతో సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ A56 అద్భుతమై డీల్ అని చెప్పొచ్చు.