Best Flagship Smartphone Deals : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై బెస్ట్ డీల్స్.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

Best Flagship Smartphone Deals : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు భారీ తగ్గింపు పొందవచ్చు.

1/7
Best Flagship Smartphone Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ కొన్ని గంటల్లో సేల్ మొదలు కాబోతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఈ సేల్ ఎంట్రీ లెవల్, మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం.
2/7
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పటికే ప్రైమ్ ఎర్లీ డీల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ ద్వారా మీకు నచ్చిన హైఎండ్ ఫోన్లను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వివో ఎక్స్200 ప్రో, వన్‌ప్లస్ 13 ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/7
అమెజాన్‌లో బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్‌లు : వన్‌ప్లస్ 13 : వన్‌ప్లస్ 13 ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్,12GB ర్యామ్ వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.69,999 నుంచి రూ.61,999కు తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ హై-ఆక్టేన్ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ కలిగి ఉంది. అంతేకాకుండా, మూడు 50MP సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా కలిగి ఉంది.
4/7
వివో X200 ప్రో : వివో X200 ప్రో ఫోన్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 16GB ర్యామ్ వేరియంట్‌ కలిగి ఉంది. అమెజాన్ అసలు ధర రూ. 94,999 నుంచి రూ. 89,429 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ ధర అన్ని బ్యాంక్ డిస్కౌంట్‌లతో సహా అందుబాటులో ఉంది.
5/7
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : అమెజాన్ నుంచి 256GB ఇంటర్నల్ స్టోరేజ్,12GB ర్యామ్ వేరియంట్‌ రూ.71,999కు కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ధర రూ.1,29,999 నుంచి భారీగా తగ్గింది.
6/7
అదనపు ఆఫర్లలో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది.
7/7
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా : 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌‌తో శాంసంగ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ అసలు ధర రూ.1,29,999 నుంచి రూ.1,23,499కు తగ్గింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన యూజర్లు ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై రూ.10వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200MP ప్రైమరీ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.