Best Smartphones 2026 : 5000mAh బ్యాటరీ AI కెమెరా అదుర్స్.. రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Best Smartphones 2026 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా 5000mAh బ్యాటరీ AI కెమెరాతో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10వేల లోపు ధరలో ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
- Sreehari A
- Published on- October 10, 2026 / 12:05 PM IST
Best Smartphones 2026
- అమెజాన్ సేల్‌లో రూ.10,000 లోపు ధరకే ఫోన్లు
- AI కెమెరా 5000mAh పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు
- అమెజాన్ సేల్‌లో లావా బోల్డ్ N2 25శాతం తగ్గింపు
Best Smartphones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సమయంలో రూ. 10వేల లోపు ధరలో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ సేల్‌లో సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ఫోన్‌లు ఏఐ కెమెరాలు భారీ 5000mAh బ్యాటరీలతో సహా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో రూ.10వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌ల ఫుల్ లిస్టును ఇప్పుడు చూద్దాం..
లావా బోల్డ్ N2 :
అమెజాన్ సేల్‌లో లావా బోల్డ్ N2 ఫోన్ 25శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా, రూ.9,699కే కొనేసుకోవచ్చు. అయితే, ఎస్బీఔ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే సుమారు రూ.1,000 ఆదా అవుతుంది. తద్వారా ధర సుమారు రూ.8,600కు తగ్గుతుంది. ఈ ఫోన్ 64GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో ఏఐ ఫీచర్లతో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. IP64 రేటింగ్ కూడా ఉంది.
లావా బోల్డ్ N2 లైట్ :
అమెజాన్ సేల్‌లో లావా బోల్డ్ N2 లైట్ 21శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.11,499 కాగా, సేల్ సమయంలో రూ.9,099కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కింద ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.909 ఆదా చేసుకోవచ్చు. దాంతో ధర సుమారు రూ.8వేలకు తగ్గుతుంది. ఈ ఫోన్‌లో 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇందులో 13MP ఏఐ రేర్ కెమెరా ఉంది. బాక్స్‌లో ఛార్జర్ కేస్ కూడా ఉంది.
Read Also : Google Pixel 10a : ఏంది భయ్యా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10a మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..
లావా బోల్డ్ N4 లైట్ :
అమెజాన్ సేల్‌లో లావా బోల్డ్ N4 లైట్ 16శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా, సేల్ సమయంలో రూ.8,399కే లభిస్తోంది. మీరు బ్యాంక్ ఆఫర్ కింద ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.839 ఆదా చేసుకోవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర సుమారు రూ.7,500 అవుతుంది. ఈ ఫోన్‌లో 6.56-అంగుళాల qHD డిస్‌ప్లే 5000mAh బ్యాటరీ ఉన్నాయి. 8MP రియర్ కెమెరా ఉంది. బాక్స్‌లో ఛార్జర్ కేస్ కూడా ఉంది.
జెనో 100 ప్రో :
అమెజాన్ సేల్ సమయంలో జీనో 100 ప్రోను రూ.8,199కే కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.11,999పై 32శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఎస్బీఐ కార్డుతో కొంటే సుమారుగా రూ.800 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో రూ.7,500 కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 64GB స్టోరేజ్ 5000mAh బ్యాటరీ ఉన్నాయి. 6.6-అంగుళాల 90Hz డిస్‌ప్లే కూడా ఉంది.
