Amazon Great Indian Festival Sale : వావ్.. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ ధమాకా.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Amazon Great Indian Festival Sale 2026 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8, 2026న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీలపై తగ్గింపులు పొందవచ్చు.

  • Published on- September 21, 2026 / 02:27 PM IST

Amazon Great Indian Festival Sale 2026

  • ఎస్‌బిఐ కార్డులతో 10 శాతం తగ్గింపు పొందవచ్చు
  • ప్రైమ్ సభ్యులకు అదనంగా మరో 10 శాతం తగ్గింపు
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వన్‌ప్లస్ 13s ఫోన్‌లపై తగ్గింపు

Amazon Great Indian Festival Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీని వెల్లడించిన వెంటనే షాపింగ్ దిగ్గజం అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీని వెల్లడించింది. ఈ సేల్ 2026 అక్టోబర్ 8న ప్రారంభమవుతుందని అమెజాన్ పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర టెక్ యాక్సెసరీల వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి పలు కేటగిరీలలో కంపెనీ డీల్స్ డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాదు.. కంపెనీ బ్యాంక్ డిస్కౌంట్‌లు, ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యేక బెనిఫిట్స్, అనేక ఇతర డీల్స్‌ను కూడా వెల్లడించింది. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లు ఎన్నో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫర్లు :
ఎస్బీఐ డెబిట్ క్రెడిట్ కార్డులు, అలాగే క్రెడిట్ ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. ప్రైమ్ సభ్యులకు, కంపెనీ అదనంగా మరో 10 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది. అదనపు డిస్కౌంట్ల కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. అమెజాన్ ఎంపిక చేసిన ప్రొడక్టులపై నో కాస్ట్ ఈఎంఐలను కూడా ప్రకటించింది.

అమెజాన్ డీల్స్ :
ఈ సేల్‌లో వివిధ ప్రొడక్టు కేటగిరీలలో బ్లాక్‌బస్టర్ డీల్స్, మెగా డీల్స్, టాప్ 100 డీల్స్, 8PM డీల్స్, శాంపిల్ మేనియా, అమెజాన్ కాంబోస్ వంటి మరిన్ని ఈవెంట్లు కూడా ఉన్నాయి.

Read Also : OPPO A7 Pro Max 5G : ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్.. 10,000mAh బ్యాటరీతో ఒప్పో A7 ప్రో Max 5G అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?

ఆఫర్లు :
అమెజాన్‌లో ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్‌లపై కిర్రాక్ డీల్స్‌ను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వన్‌ప్లస్ 13s, ఐక్యూ 15, షావోమీ 17, వివో X300 ఎఫ్ఈ వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మరిన్నింటిపై డిస్కౌంట్లను పొందవచ్చు.

ప్రీమియం మిడ్-రేంజ్ కేటగిరీలో రియల్‌మి నార్జో పవర్, రెడ్‌మి టర్బో 5, వన్‌ప్లస్ నార్డ్ 6 తగ్గింపు డీల్స్‌ అందిస్తోంది. అందులో శాంసంగ్ M47, రెడ్‌మి నోట్ 17, రెడ్‌మి A7 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 వంటి ఇతర ఫోన్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

యాక్సెసరీల విషయానికొస్తే..
వన్‌ప్లస్ బడ్స్ 4, నార్డ్ బడ్స్ 4, 4 ప్రో, రియల్‌మి బడ్స్ ఎయిర్ 8, బడ్స్ T310, T500 ప్రో, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 ప్రో బడ్స్ కోర్, ఇతర టీడబ్ల్యుఎస్ (TWS) వంటి పర్సనల్ ఆడియో ప్రొడక్టులపై అదిరే డీల్స్‌ అందిస్తోంది.