Tecno Pop X 5G Sale : వావ్.. దీపావళి ఆఫర్.. టెక్నో పాప్ X 5G భారీగా తగ్గిందోచ్.. ధర జస్ట్ రూ.15 వేలలోపే..!

Tecno Pop X 5G Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో టెక్నో పాప్ X 5G ధర రూ.14,249కు తగ్గింపు పొందనుంది. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 13MP కెమెరా ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Tecno Pop X 5G Sale

  • టెక్నో పాప్ ఎక్స్ 5G 6.78-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
  • బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరా సెటప్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌

Tecno Pop X 5G Sale : దీపావళి షాపింగ్ కోసం బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రీలోడెడ్ 2026లో అందుబాటులో ఉన్న టెక్నో పాప్ X 5G మీ దృష్టిని ఆకర్షించవచ్చు. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్.. తక్కువ ధరలో కొత్త మొబైల్ కోసం చూస్తున్న వారికి ఒక ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది.

టెక్నో పాప్ ఎక్స్ 5జీ ధర ఎంతంటే? :
టెక్నో పాప్ ఎక్స్ 5జీ (6GB ర్యామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్ అమెజాన్‌లో రూ.15,499 ధరతో లిస్ట్ అయింది. సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్లు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, గరిష్ఠంగా రూ.1,250 వరకు పొందవచ్చు. ఈ ఆఫర్ వర్తిస్తే ఫోన్ ధర రూ.14,249కు తగ్గుతుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ద్వారా అదనపు ఆదా చేయొచ్చు. అయితే ఆఫర్ల నిబంధనలు, అర్హతలను కొనే ముందే చెక్ చేసుకోవడం బెటర్..

Read Also : Hyundai Bayon : 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు, లెవల్ 2 ADASతో వస్తున్న కొత్త హ్యుందాయ్ SUV.. బుకింగ్ వివరాలివే..!

6500mAh బ్యాటరీ.. 120Hz డిస్‌ప్లే :
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. 720 × 1576 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS16పై రన్ అవుతుంది. మరో మెయిన్ అట్రాక్షన్.. 6500mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. లాంగ్ టైమ్ ఫోన్ వాడేవారికి ఈ బ్యాటరీ సామర్థ్యం చాలా బెనిఫిట్ ఉండొచ్చు.

13MP కెమెరా.. మన్నికైన బాడీ :
ఫొటోల కోసం బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 210 గ్రాములు కాగా, మందం 8.18 మిల్లీమీటర్లు. MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, IP64 PRO రేటింగ్‌తో వస్తుంది.

మొత్తంగా, రూ.15 వేల బడ్జెట్‌లో భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి టెక్నో పాప్ X 5జీ అద్భుతమైన ఫోన్. అయితే కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది.