Amazon Great Republic Day Sale ends tomorrow: Deals on premium smartphones you shouldn't miss
Amazon Great Republic Day Sale 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19తో ముగియనుంది. ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రత్యేకించి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లతో ఈఎంఐ లావాదేవీలతో కొనుగోలుదారులు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. వన్‌ప్లస్, శాంసంగ్, రియల్‌మి, షావోమీ, ఆపిల్, ఐక్యూ, హానర్, మోటోరోలా, పోకో వంటి ఇతర ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ప్లాట్ డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోళ్లు చేసే కస్టమర్‌లు అన్‌లిమిటెడ్ 5శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో గరిష్టంగా రూ. 5వేల వరకు రివార్డ్‌లను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
హానర్ 90 (12జీబీ + 512జీబీ ) :
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 49,999కి బదులుగా రూ. 30,999 వద్ద అందుబాటులో ఉంది. అదనంగా, కస్టమర్లు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీపై ఫ్లాట్ రూ. 2250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపీ అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 120హెచ్‌జెడ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ అమోల్డ్ డిస్‌ప్లే, మొదటి 3840హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1పై రన్ అవుతుంది.
Honor 90
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ) :
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 39,999 ధర వద్ద రిటైల్ అవుతుంది. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నాన్-ఈఎంఐ లావాదేవీపై రూ. 750 వరకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ సోనీ ఐఎమ్ఎక్స్890, 8ఎంపీ అల్ట్రావైడ్, మాక్రో లెన్స్‌తో కూడిన 50ఎంపీ ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ సూపర్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ రన్ అవుతుంది.
OnePlus 11R 5G
ఐక్యూ 12 5జీ (12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ) :
ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 52,999 ధరకు అందుబాటులో ఉంది. మీరు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీపై ఫ్లాట్ రూ. 2250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐక్యూ 12 5జీ మోడల్ 4ఎన్ఎమ్ టీఎస్ఎంసీ ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 750 జీపీయూ, ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ని కలిగి ఉంది.
IQ 12 5G Phone
ఈ ఫోన్ కెమెరా సెటప్‌లో 100ఎక్స్ డిజిటల్ జూమ్‌తో 50ఎంపీ ఆస్ట్రోగ్రఫీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్, 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో ఉన్నాయి. 6.78 144హెచ్‌జెడ్ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 3000నిట్ పీక్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్, డస్ట్/వాటర్ రెసిస్టెన్స్ ఐపీ64 రేటింగ్, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
మోటోరోలా రెజర్ 40 అల్ట్రా (8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్) :
ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 69,999 ధర వద్ద లభిస్తుంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్, 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6.9 ఎఫ్‌హెచ్‌డీ+ పోలెడ్ మెయిన్ డిస్‌ప్లే, 3.6 పోలెడ్ ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
motorola razr 40 ultra
కెమెరా సెటప్‌లో ఓఐఎస్‌తో 12ఎంపీ ప్రధాన కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్/మాక్రో, ప్రధాన డిస్‌ప్లేలో 32ఎంపీ, ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లేలో 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఐపీ52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్, 30డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్‌తో కూడిన 3800ఎంఎహెచ్ బ్యాటరీ, 5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
Apple iphone 13
ఆపిల్ ఐఫోన్ 13 (256జీబీ) :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 12ఎంపీ వెడల్పు, అల్ట్రా-వైడ్ కెమెరాలతో కూడిన అధునాతన డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. 4కె డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్, నైట్ మోడ్‌తో కూడిన 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఏ15 బయోనిక్ చిప్ కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఐఫోన్ రూ. 61,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.