Amazon Summer Sale 2026 : లగ్జరీ ఫోన్లు.. ఇప్పుడు లోకల్ ధరలో.. ఈ టాప్ రేంజ్ శాంసంగ్ ఫోన్లపై షాకింగ్ డీల్స్..!

Amazon Great Summer Sale 2026 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, S26 అల్ట్రా, ఎమ్ సిరీస్ ఫోన్‌లు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో పాటు తగ్గింపు ధరలకే పొందవచ్చు.

Amazon Great Summer Sale 2026

  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ. 94,999కి తగ్గింది
  • HDFC బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ బడ్జెట్ ఫోన్‌లు రెండింటిపై ఆఫర్లు అందుబాటులో

Amazon Great Summer Sale 2026 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై అమెజాన్ 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ (Amazon Summer Sale 2026) మెంబర్‌షిప్ కస్టమర్‌లకు కనీసం 15శాతం అదనంగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ సేల్ సమయంలో అనేక ఫోన్లపై కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్ :
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర రూ. 1,30,999కి చేరింది. గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాను ఇప్పుడు రూ.94,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,29,999 కాగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు , క్యాష్‌బ్యాక్‌తో ధర ఇంకా తగ్గింపు పొందవచ్చు.

Read Also : Flipkart Summer Sale : వావ్.. ఏంటి భయ్యా ఆఫర్లు.. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25పై మతిపొగొట్టే డీల్స్.. ఫుల్ డిస్కౌంట్‌లో!

శాంసంగ్ గెలాక్సీ A56 ఫోన్ కూడా రూ. 42,999కే తగ్గింపు ధరకే లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M56 ఫోన్ ధర రూ. 21,998కి తగ్గింది. శాంసంగ్ గెలాక్సీ M36 5జీ ధర రూ. 18,999గా ఉంది. అమెజాన్ సేల్ సందర్భంగా అనేక బడ్జెట్ మిడ్-రేంజ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుతున్నాయి.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల కోసం శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ధర రూ. 13,998కు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ రూ. 12,499 కి కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M07 4జీ ధర రూ. 9,499కు సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో శాంసంగ్‌తో పాటు వన్‌ప్లస్, రెడ్‌మి, రియల్‌మి, ఐక్యూ, ఒప్పో వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కూడా లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ల్యాప్‌టాప్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్లు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.