Flipkart Summer Sale : వావ్.. ఏంటి భయ్యా ఆఫర్లు.. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25పై మతిపొగొట్టే డీల్స్.. ఫుల్ డిస్కౌంట్లో!
Flipkart Summer Sale : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్షిప్ యూజర్ల ఇప్పటికే ప్రారంభం కాగా అందరి యూజర్ల కోసం మే 8 నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25పై భారీ డీల్స్ పొందవచ్చు.
Flipkart Summer Sale
- ఐఫోన్ 17 రూ. 82,900 నుంచి రూ. 71,900కే కొనుగోలు చేయొచ్చు
- శాంసంగ్ గెలాక్సీ 25 సేల్‌లో రూ. 53,999 ప్రారంభ ధరతో లభ్యం
- మోటో G57 పవర్ రూ. 15,999కి కొనుగోలు చేసే అవకాశం
Flipkart Summer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ప్లస్ మెంబర్షిప్ యూజర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ మొదలైంది. అందరు ఫ్లిప్‌కార్ట్ మెంబర్ల కోసం మే 8 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సమయంలో ఆసక్తిగల వినియోగదారులు ఆపిల్, రియల్‌మి, పోకో, వివో, రెడ్మీ వంటి బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
అంతేకాదు.. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర హోం (Flipkart Summer Sale) అప్లియన్సెస్‌పై కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్లు, డీల్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్, మరెన్నో ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ధర రూ. 82,900 నుంచి రూ. 71,900కే తగ్గింది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ 25 ఫోన్ రూ. 53,999 ధరతో లభ్యం కానుంది. మోటో G57 పవర్‌ను రూ. 15,999కు కొనేసుకోవచ్చు.
ఒప్పో K14x 5జీ ప్రారంభ ధర రూ. 14,499కు పొందవచ్చు. వివో X200T 5జీ ప్రారంభ ధర రూ. 49,999కు లభిస్తుంది. రియల్‌మి P4X 5జీ ప్రారంభ ధర రూ. 16,999కు సొంతం చేసుకోవచ్చు. పోకో F7 5జీ ప్రారంభ ధర రూ. 31,999కు లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు:
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఈఎంఐ లావాదేవీలతో సహా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆదా అవుతుంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ ఈఎంఐలపై రూ. లక్ష వరకు క్రెడిట్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సాసా లేలేలో భారీ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 55 అంగుళాల మినీ ఎల్ఈడీ టీవీ రూ. 39,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. అలాగే, ఈ సేల్‌లో 1.5 టన్ ఏసీ రూ. 25,490 ధరకు లభిస్తుంది. ఈ సేల్‌లో ప్రీమియం రిఫ్రిజిరేటర్ రూ. 25,740 ప్రారంభ ధరతో లభిస్తుంది. 9 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ. 25,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో 7 లీటర్ల వాటర్ ప్యూరిఫైయర్ కేవలం రూ. 9,999కే లభిస్తుంది.
ఈ సేల్‌లో ఎక్స్‌పర్ట్‌బుక్ P1 కేవలం రూ. 50,990కే లభిస్తుంది. రెడ్మి ప్యాడ్ 2 ప్రో 5జీ రూ. 24,999కే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో సీఎంఎఫ్ బడ్స్ 2ఎ కేవలం రూ. 1,699కే అందుబాటులో ఉంటుంది. ఆపిల్ వాచ్ Se3 కేవలం రూ. 23,299 ప్రారంభ ధరతో లభిస్తుంది.
