Vivo X300 Pro : వివో ఫ్యాన్స్ మీకోసమే.. ఈ వివో X300 ప్రోపై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఎందుకు కొనాలంటే?

Amazon Great Summer Sale 2026 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నడుస్తోంది. వివో ఎక్స్300 ప్రో రూ. 10,000 తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరే డీల్ ఎలా పొందాలంటే?

Amazon Great Summer Sale 2026

  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభమైంది
  • ఈ సేల్‌లో అతిపెద్ద ఆఫర్లలో వివో X300 ప్రోపై భారీ తగ్గింపు
  • మీరు రూ. 10వేల వరకు సేవ్ చేసుకోవచ్చు

Amazon Great Summer Sale 2026 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నడుస్తోంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.

ఈ అమెజాన్ సేల్‌లో వివో X300 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ రూ. 10వేల తగ్గింపుతో లభిస్తోంది. వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్, ఇతర ఫీచర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

వివో X300 ప్రో అమెజాన్ డీల్ :
అమెజాన్‌లో వివో ఎక్స్300 ప్రో రూ. 1,09,998 ధరకు లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పూర్తి పేమెంట్ చేస్తే.. రూ. 10వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Amazon Summer Sale : ఆపిల్ లవర్స్ ఎగిరిగంతేసే డిస్కౌంట్.. ఐఫోన్ ఎయిర్‌ రూ. 22వేలు తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

ఈఎంఐ లావాదేవీలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 10వేల తగ్గింపు అందిస్తోంది. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం పాత స్మార్ట్‌ఫోన్‌తో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో X300 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. HDR10+, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ HDR, SGS లో బ్లూ లైట్, TÜV రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీ వంటి సర్టిఫికేషన్లు ఉన్నాయి.

వివో X300 ప్రో ఫోన్ లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ అందిస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,510mAh బ్యాటరీని అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో X300 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP సోనీ LYT-828 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ JN1 లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్, OIS, ఎఫ్/2.67 అపర్చర్‌, 200MP HPB టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంది.