Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. క్వాడ్ బ్యాక్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, గెలాక్సీ ఏఐ యాక్సెస్ వంటి అనేక ఇతర ఫీచర్లతో గెలాక్సీ S25 అల్ట్రా సరసమైన ధరకే లభ్యమవుతోంది.
ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. క్వాడ్ బ్యాక్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ సీపీయూ, గెలాక్సీ ఏఐ యాక్సెస్, అనేక ఇతర పవర్‌ఫుల్ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ కన్నా ముందే పాత S25 అల్ట్రా మోడల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర :
256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ మోడల్ ఫస్ట్ భారతీయ మార్కెట్లో రూ. 1,29,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం రూ. 1,11,990 ధరకే లభిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే బ్యాలెన్స్‌పై అదనంగా రూ. 3,359 తగ్గింపు పొందవచ్చు. టైటానియం గ్రే కలర్ వేరియంట్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ఫోన్ ప్యానెల్ ప్రొటెక్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అడ్రినో 830 జీపీయూ ఫోన్ పవర్ అందిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం 7 భారీ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఎలాంటి లైటింగ్ పరిస్థితుల్లోనైనా కెమెరాతో క్లియర్ ఫొటోలను తీయొచ్చు. అలాగే, వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీతో పాటు, ఫోన్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.