Amazon Prime Day Sale : అమెజాన్‌లో అదిరే సేల్.. వన్‌ప్లస్ 13s భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే చాలా చీప్..!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ రెండో రోజు నడుస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 13ఎస్ ధర ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం..

OnePlus 13s Smartphone

  • వన్‌ప్లస్ 13ఎస్ 6.32-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లే
  • 5850mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా
  • 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5850mAh బ్యాటరీ సెటప్

Amazon Prime Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన మిడ్-రేంజ్ ఫోన్ వన్‌ప్లస్ 13s కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. 50MP ప్రైమరీ కెమెరా, 5850mAh బ్యాటరీతో ఈ వన్‌ప్లస్ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. వన్‌ప్లస్ 13sపై అద్భుతమైన డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

వన్‌ప్లస్ 13ఎస్ ధర, ఆఫర్లు :
వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్‌లో రూ. 49,999 ధరకు (Amazon Prime Day Sale) లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే పేమెంట్లపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. తద్వారా అసలు ధర తగ్గుతుంది. గత ఏడాది జూన్‌లో రూ. 54,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు సుమారు రూ. 5వేలు తక్కువకే లభిస్తోంది.

Read Also : Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ కస్టమర్లకు డబుల్ ధమాకా.. 28 రోజుల వ్యాలిడిటీ, ఒక్క రీఛార్జ్‌తో 15 OTT యాప్‌లు!

వన్‌ప్లస్ 13ఎస్ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్ 2640×1216 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. ఇందులో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5850mAh బ్యాటరీ ఉంది.

వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్ పొడవు 150.8mm, వెడల్పు 71.7mm, మందం 8.2mm, బరువు 185 గ్రాములు ఉంటుంది. రియర్ కెమెరాలో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.