Redmi 13 5G Offer : రెడ్‌మి ఫోన్ భలే ఉంది భయ్యా.. 108MP కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది, ధర కూడా మీ బడ్జెట్‌లోనే

Redmi 13 5G : 108MP కెమెరాతో రెడ్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ కెమెరాతో ఈ ఫోన్ ప్రస్తుతం చౌకగా లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Redmi 13 5G ( Image Credit to Original Source )

  • అమెజాన్‌లో రెడ్‌మి 13 5G సేల్ ఆఫర్లు
  • 108MP కెమెరాతో రెడ్‌మి 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే
  • రూ. 2,500 డైరెక్ట్ డిస్కౌంట్, ఈఎంఐతో రూ.620 డిస్కౌంట్
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.9వేల వరకు ఆదా

Redmi 13 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? హోలీకి ముందే అద్భుతమైన ఆఫర్. 108MP కెమెరాతో రెడ్‌మి 13 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ రెడ్‌మి ఫోన్ రూ. 13వేల కన్నా తక్కువ ధరలో కొనేసుకోవచ్చు.

అదిరిపోయే కెమెరా, వాటర్ రెసిస్టెన్స్ కెపాసిటీ అందించే ప్రైమ్ ఎడిషన్‌పై అమెజాన్ అదిరే డీల్ అందిస్తోంది. దాంతో ఇప్పుడు రూ. 13వేల కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. రెడ్‌మి 13 5జీ ప్రైమ్ ఎడిషన్, 108MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ముఖ్యంగా, ఫోన్ వెట్ టచ్ కంట్రోలింగ్ అందిస్తుంది. అంటే.. మీ చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్‌ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట.

రెడ్‌మి 13 5జీపై అద్భుతమైన డీల్ :
ప్రస్తుతం, అమెజాన్ రెడ్‌మి 13 5జీపై దాదాపు రూ. 2,500 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ. 15,499 నుంచి 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో బేస్ మోడల్ ఇప్పుడు రూ. 12,999కు అందుబాటులో ఉంది. బ్యాంకులు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఈఎంఐ ద్వారా కొంటే రూ.620 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌పై రూ.9వేల వరకు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Vivo T4 Lite 5G : వాలెంటైన్స్ డే సేల్‌లో ఈ వివో 5G ఫోన్ జస్ట్ రూ. 9,977కే, ఫీచర్లు మాత్రం కేక.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

రెడ్‌మి 13 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి 13 5Gలో 108MP భారీ ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. కెమెరాకు ఏఐ సపోర్టు ఫ్రేమింగ్, ఫోటో క్వాలిటీని అందిస్తుంది. ఫొటో హెచ్‌డీఆర్, నైట్ మోడ్, ఫిల్మ్ ఫిల్టర్లు, టైమ్-లాప్స్ వంటి అదనపు మోడ్‌ కూడా ఉంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. వీడియో కాల్స్, ఫొటోలు, పోర్ట్రెయిట్‌లకు అద్భుతంగా ఉంటుంది.

ఈ ఫోన్ 90Hz వద్ద 6.79-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ అందిస్తుంది. 5జీ సీపీయూతో ఈ మిడ్-రేంజ్ ఫోన్ వీడియో స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా ఉంది. గరిష్టంగా 3 ధఓపో పాటు, ఫోన్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకుంటుంది. 128GB స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్‌తో 1TBకి స్టోరేజీ పెంచుకోవచ్చు. 12GB ర్యామ్ వరకు సపోర్టు అందిస్తుంది.

6GB వర్చువల్ ర్యామ్, 6GB ఒరిజినల్ ర్యామ్ ఉన్నాయి. బాక్సులో ఛార్జర్‌తో ఫోన్ 5030mAh బ్యాటరీ అందిస్తుంది. సోషల్ మీడియా, వీడియోలు, కాల్స్, 5G బ్రౌజింగ్‌కు బెస్ట్ ఫోన్. 33W టర్బో ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. రెడ్‌మి 13 5జీ ఫోన్ గ్లాస్ బ్యాక్, IP54 సార్టింగ్ వాటర్ పడినా చెక్కుచెదరదు. సేఫ్టీ, సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.