Anand Mahindra: రూ.12వేలకే జీప్ దొరికేది.. ఆ రోజులే బాగున్నాయంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఇండియా ప్రొడక్ట్ అయిన మహీంద్రా.. ప్రపంచంలోనే బెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్. ప్రత్యేకించి 2022లో బాగా అమ్మకాలు జరుపుతున్న ఈ బ్రాండ్ వెహికల్ ను 1960 నాటి జీప్ తో పోల్చుతూ...
- Subhan Ali Shaik
- Published On : March 9, 2022 / 12:54 PM IST
Mahindra Jeep
Anand Mahindra: ఇండియా ప్రొడక్ట్ అయిన మహీంద్రా.. ప్రపంచంలోనే బెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్. ప్రత్యేకించి 2022లో బాగా అమ్మకాలు జరుపుతున్న ఈ బ్రాండ్ వెహికల్ ను 1960 నాటి జీప్ తో పోల్చుతూ ట్వీట్ చేశారు మహీంద్రా. ‘అప్పట్లో వస్తువులు ఇప్పటికంటే చాలా చీప్ గా దొరికేవి’ అని పోస్టు పెట్టారు.
ఇండస్ట్రియేలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఆ రోజులే మంచివి అంటూ మహీంద్రా జీప్ ధరను పోల్చారు. ఈ సందర్భంగా మహీంద్రా పాత జీప్ యాడ్‌ను ధరతో సహా పోస్టు చేశారు. Willys CJ 3Bను రూ.12వేల 421కే అందుబాటులో ఉండేది. మహీంద్రా ఈ యాడ్ పోస్టు చేయగా దానిపై రూ.200 డిస్కౌంట్ కూడా ఉంది.
ఆ పిక్ పోస్టు చేయడంతో పాటు దాని కిందే మరో కామెంట్ పెట్టారు. ‘ఓ మంచి ఫ్రెండ్, తన కుటుంబంతో పాటు దశాబ్ద కాలంగా ఉంటున్న పాత వెహిక్స్ ను ఇతరులకు ఇచ్చేశాడు. అవే మంచి పాత రోజులు, ధరల అందుబాటు అనేది పరిణామంలో ఉండేవి’ అంటూ కామెంట్ రాసుకొచ్చారు.
Read Also : మహీంద్రా మెగా ఆఫర్లు.. SUV కార్లపై రూ.3 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు..!
ఈ ట్వీట్ పై సరదాగా పోస్టు చేసిన చాలా మంది.. ఇప్పటికీ అవే ధరలు అందుబాటులో ఉన్నాయా.. అంటూ పోస్టు చేస్తే అప్పటి రూ.12వేల 421రూపాయలు ప్రస్తుతానికి రూ.10.50లక్షలతో సమానం.
