Apple AirPods Series : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఎయిర్‌ప్రాడ్ హెడ్‌ఫోన్‌లపై అదిరే డిస్కౌంట్లు.. రూ. 19,901 ధరకే సొంతం చేసుకోవచ్చు!

Apple AirPods Series : ఆపిల్ నుంచి (AirPods Max) హెడ్‌ఫోన్‌లు చాలా ఖరీదైనవి. అయితే, ప్రస్తుతం రూ. 20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో Airpods Pro సిరీస్ దాదాపు రూ. 8వేల డిస్కౌంట్ అందిస్తుంది.

Apple AirPods Max and Airpods Pro get up to Rs 19,901 discount on Flipkart

Apple AirPods Series discount on Flipkart : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఎయిర్‌ప్యాడ్స్ మ్యాక్స్ (AirPods Max) ఫస్ట్ జనరేషన్ (Airpods Pro) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ ఆడియో ప్రొడక్టులపై భారీ డీల్‌లను అందిస్తోంది. ఆపిల్ నుంచి వచ్చే హెడ్‌ఫోన్‌లు చాలా ఖరీదైనవి. అయితే, ప్రస్తుతం రూ. 20వేల ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్‌ప్యాడ్స్ ప్రో దాదాపు రూ. 8వేల తగ్గింపును పొందింది. కొన్ని అదనపు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Read Also : Hero MotoCorp Prices : జూలై 3 నుంచి భారీగా పెరగనున్న హీరో మోటోకార్ప్ బైకుల ధరలు.. ఏ బైకు ధర ఎంత ఉండొచ్చుంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్‌ప్యాడ్స్ మ్యాక్స్ భారీ తగ్గింపు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో AirPods Max రూ. 39,999 కన్నా తక్కువగా అందిస్తుంది. ఆపిల్ అధికారికంగా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రూ. 59,900కి విక్రయిస్తోంది. వినియోగదారులు AirPods Maxపై రూ. 19,901 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌పై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవు. మీరు EMI లావాదేవీని ఎంచుకుంటే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.38,749కి తగ్గుతుంది. ఈ డీల్ ధర పింక్ మోడల్‌కు మాత్రమే. గ్రీన్, సిల్వర్ కలర్ మోడల్‌ ఎక్కువ ఖర్చు అవుతాయి. కానీ, వాటిపై ఇంకా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. రెండు మోడల్స్ ధర రూ.44,999 ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 3వేల అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ.41,999 పొందవచ్చు.

Apple AirPods Max and Airpods Pro get up to Rs 19,901 discount on Flipkart

ఆపిల్ Airpods Pro ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ Airpods ప్రో రూ. 16,990 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఈ ప్రో అధికారిక ధర రూ. 24,900 నుంచి తగ్గింది. ఆపిల్ నుంచి ఫస్ట్ జనరేషన్ రియల్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,910 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ ఈ డీల్‌కు కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్‌తో ధర రూ.15,740కి తగ్గుతుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్) :
ఆపిల్ సెకండ్ జనరేషన్ AirPods ప్రోని (Apple.in) వెబ్‌సైట్ ద్వారా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో రిటైల్ ధర రూ. 26,900 వద్ద అందుబాటులో ఉన్నాయి, అయితే, ఆసక్తి ఉన్న యూజర్లు ఎలాంటి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించకుండా ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 24,990 తగ్గింపు ధరతో AirPods ప్రోని పొందవచ్చు. అదనంగా, EMI ఆప్షన్లపై బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా పొందవచ్చు.

Read Also : Svitch Bike Experience Centre : హైదరాబాద్‌‌కు ‘స్విచ్ బైక్’ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వచ్చేసిందోచ్..!

ట్రెండింగ్ వార్తలు