Apple Back to School Sale : స్టూడెంట్స్ కోసం ఖతర్నాక్ సేల్.. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు..

Apple Back to School Sale : భారత మార్కెట్లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్ ఆఫర్లను అందిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple Back to School Sale

  • మ్యాక్‌బుక్ నియోను రూ. 10వేల తగ్గింపుతో కొనేసుకోవచ్చు
  • విద్యార్థులు తమకు నచ్చిన ఫ్రీ ప్రొడక్టును ఇంటికి తెచ్చుకోవచ్చు
  • ఆపిల్ ఇటీవలే మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను పెంచింది

Apple Back to School Sale : ఆపిల్ ఐఫోన్లతో సహా అన్ని ప్రొడక్టుల ధరలను భారీగా పెంచేసింది. ఆపిల్ ఇటీవలే M5 ప్రాసెసర్‌తో లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్, M5, M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌సెట్‌లతో మ్యాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్ (2024), ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా పలు డివైజ్ ధరలను పెంచింది. అయినా, ఇప్పుడు కొత్త మ్యాక్‌బుక్ లేదా ఐప్యాడ్ మోడల్‌ తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

అది ఎలాగంటే? విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం, ఆపిల్ వార్షిక ‘బ్యాక్ టు స్కూల్’ ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ స్టూడెంట్ డిస్కౌంట్‌లలో భాగంగా వినియోగదారులు కొత్త డివైజ్ తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎయిర్‌పాడ్స్ 4, ఆపిల్ పెన్సిల్, లేదా ఎయిర్‌ట్యాగ్ వంటి ఫ్రీ యాక్సెసరీని ఎంచుకోవచ్చు.

భారత్‌లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్ ఆఫర్లు :
ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్ భారత మార్కెట్లో ప్రారంభం కాగా ఆగస్టు 27న ముగుస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ ఏడాది మొత్తం స్టూడెంట్ డిస్కౌంట్లలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివిధ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్లను తక్కువ ధరలకే అందిస్తోంది. అంతేకాదు.. ఎయిర్‌పాడ్స్ 4, ఆపిల్ పెన్సిల్ ఎయిర్‌ట్యాగ్స్ వంటి వివిధ యాక్సెసరీలను కూడా ఫ్రీగా అందిస్తోంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ M5 :
M5 ప్రాసెసర్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ (2026) , స్టూడెంట్స్ సేవింగ్స్ డిస్కౌంట్‌తో కలిపి రూ. 1,37,900 ప్రారంభ ధరకు కొనేసుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు బేస్ ఎయిర్‌పాడ్స్ 4 లేదా 4 ఎయిర్‌ట్యాగ్‌ల బండిల్‌ను ఫ్రీగా పొందవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో ఎయిర్‌పాడ్స్ 4ను రూ. 5వేలకు లేదా ఎయిర్‌పాడ్స్ ప్రో 3ను రూ. 13వేలకు కొనేసుకోవచ్చు.

Read Also : Oppo K15 Launch : ఒప్పో లవర్స్ మీకోసమే.. కొత్త ఒప్పో K15 లాంచ్ డేట్ ఇదే.. కీలక ఫీచర్లు లీక్..

మ్యాక్‌బుక్ ప్రో M5 :
మ్యాక్‌బుక్ ప్రో విషయానికి వస్తే.. విద్యార్థులు M5 చిప్‌సెట్‌తో 2025 మోడల్‌ రూ. 2,27,900 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు. అలాగే, మ్యాక్‌బుక్ M5 ప్రో, M5 మ్యాక్స్ ప్రాసెసర్‌ మోడళ్లను వరుసగా రూ. 2,81,900, రూ. 4,62,900 ధరలకు కొనేసుకోవచ్చు. టెక్ దిగ్గజం యూజర్లకు ఎయిర్‌పాడ్స్ 4 లేదా 4 ఎయిర్‌ట్యాగ్‌ ప్యాక్‌ను ఫ్రీగా అందిస్తోంది. ఎయిర్ మోడల్‌ మాదిరిగానే అంతే తగ్గింపు ధరకు ఏఎన్‌సీ (ANC) ఎయిర్‌పాడ్స్ 4 లేదా ఎయిర్‌పాడ్స్ ప్రో 3కి అప్‌గ్రేడ్ చేయొచ్చు.

ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో :
ఎం4 చిప్‌సెట్‌తో ఐప్యాడ్ ఎయిర్ (2025) బేస్ మోడల్ రూ. 83,900 తగ్గింపు ధరకు లభిస్తోంది. ఐప్యాడ్ ప్రో (2025)ను ఎడ్యుకేషన్ సేవింగ్స్‌తో రూ. 1,27,900 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ టెక్ దిగ్గజం, ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్‌లో భాగంగా పెన్సిల్ ప్రోను ఫ్రీగా అందిస్తోంది. వినియోగదారులు అదనపు ధర రూ. 2వేలకు 4 ఎయిర్‌ట్యాగ్‌ల ప్యాక్‌, రూ. 2వేలకు ఎయిర్‌పాడ్స్ 4, రూ. 3వేలకు ఏఎన్‌సీతో ఎయిర్‌పాడ్స్ 4 లేదా రూ. 15వేలకు ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కూడా ఎంచుకోవచ్చు.

మ్యాక్‌బుక్ నియో :
ఆపిల్ సిలికాన్ A18 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ మ్యాక్‌బుక్ నియో 256జీబీ స్టోరేజ్ బేస్ మోడల్‌ను రూ. 69,900 తగ్గింపు ధరకు అందిస్తోంది. అలాగే, టచ్ ఐడీ సెన్సార్‌, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 79,900కు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ సాధారణ రిటైల్ ధరలైన రూ. 79,900, రూ. 89,900 నుంచి వరుసగా రూ. 10వేలు తగ్గింపు అందిస్తుంది.