×
Ad

Apple iOS 26.2 Beta 3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iOS 26.2 బీటా 3 వచ్చిందోచ్.. కొత్త ఫీచర్ల ఫుల్ లిస్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

Apple iOS 26.2 Beta 3 : ఆపిల్ iOS 26.2 బీటా 3 వెర్షన్ రిలీజ్ అయింది. కొత్త ఫీచర్లతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే?

Apple iOS 26.2 Beta 3

Apple iOS 26.2 Beta 3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ థర్డ్ పార్టీ iOS 26.2 డెవలపర్ బీటాను రిలీజ్ చేసింది. డిసెంబర్‌లో మెయిన్ అప్‌డేట్ పబ్లిక్ రిలీజ్ కానుంది. ఇంటర్‌ఫేస్ పాలిష్, ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌లు మైక్రో డిజైన్ అడ్జెస్ట్ వంటివి రానున్నాయి. ఈ లేటెస్ట్ వెర్షన్ ఆపిల్ అప్‌గ్రేడ్‌తో ఎయిర్‌డ్రాప్, మెజర్, రిమైండర్‌లు అనేక సిస్టమ్ అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. కొత్త డెవలప్ హుక్‌లను యాడ్ చేస్తుంది. బీటా 2 తర్వాత iOS 26తో లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

iOS 26.2 బీటా 3 అప్‌డేట్ :
బీటా 3లో మెయిన్ ఫీచర్ అల్ట్రానేట్ ఎయిర్‌డ్రాప్ కోడ్ సిస్టమ్ (Apple iOS 26.2 Beta 3) ఉన్నట్టు మాక్‌రూమర్స్ గుర్తించింది. ఐఫోన్ యూజర్లు ఎయిర్‌డ్రాప్‌ను EveryOne సెట్టింగ్‌కు మార్చకుండా వారి కాంటాక్ట్‌ల్లో లేని వారితో కూడా ఫైల్‌లను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.

వన్-టైమ్ కోడ్‌ను రూపొందించిన తర్వాత రెండు డివైజ్‌లు 30 రోజుల పాటు కనిపిస్తాయి Settings > General > Airdrop > Manage Known AirDrop Contactsద్వారా యాక్సెస్‌ను రివ్యూ లేదా రిమూవ్ చేయొచ్చు. Contacts Only, Everyone for 10 Minutes ఆప్షన్లను కూడా అందిస్తుంది.

కొత్త ఫీచర్ల ఫుల్ లిస్ట్ :

ఈ అప్‌డేట్‌లో ఆపిల్ స్లీప్ స్కోర్ రేటింగ్‌లను కూడా రీజనరేట్ చేసింది. హైయర్ లేబుల్‌ను ఎక్సలెంట్ నుంచి వెరీ హైకి మార్చింది. మునుపటి రిజల్ట్స్ ఫిక్స్ చేసేందుకు అన్ని స్కోరింగ్ కేటగిరీలను అడ్జెస్ట్ చేసింది. ఆపిల్ పాడ్‌కాస్ట్‌లు ఇప్పుడు ఆటోమాటిక్‌గా చాప్టర్స్ క్రియేట్ చేయొచ్చు. షోలతో పాటు సంబంధిత విషయాల కోసం ఏఐ ఉపయోగించవచ్చు. అయితే, ఆపిల్ న్యూస్ పాపులారిటీ సెక్షన్లకు షార్ట్ కట్‌లతో క్లీనర్ లేఅవుట్‌ను అందిస్తుంది.

Read Also : Motorola Edge 50 Pro : ఇది కదా ఫోన్ అంటే.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

కొత్త లిక్విడ్ గ్లాస్ లాక్ స్క్రీన్ స్లయిడర్ యూజర్లకు క్లాక్ అస్పష్టతపై కంట్రోల్ ఇస్తుంది. మెజర్ యాప్ అప్‌డేట్ చేసిన లిక్విడ్ గ్లాస్-స్టయిల్ నెంబర్లను స్వీకరిస్తుంది. కార్‌ప్లే ఇప్పుడు మెసేజెస్ యాప్‌లో పిన్ చేసిన కాన్వార్జేషన్లను హైడ్ చేసేందుకు ఒక ఆప్షన్ కలిగి ఉంది. అదే సమయంలో ఫోకస్ మోడ్స్ అలారాలు, టైమర్‌లను ట్రిగ్గర్ చేసేందుకు యూజర్లకు ఇప్పుడు రిమైండర్‌ల యాప్‌లో ఎమర్జెన్సీ టాస్కులను సెట్ చేయవచ్చు.

హెల్త్ ఫీచర్ల కోసం ఆపిల్ థర్డ్ పార్టీ యాప్‌ల కోసం హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్ యాక్సెస్‌ ప్రారంభించింది. మెడికల్ యాప్‌లు అథరైజ్ తర్వాత ఆపిల్ వాచ్ నుంచి అలర్ట్స్స్ రీడ్ చేసేందుకు అనుమతిస్తుంది. జపాన్ కోసం ఆపిల్ కొత్త సైడ్ బటన్ యాక్షన్‌ కూడా ఉండొచ్చు. అర్హత కలిగిన యూజర్లు సిరిపై మాత్రమే ఆధారపడకుండా జెమిని లేదా అలెక్సా వంటి అల్ట్రానేట్ వాయిస్ అసిస్టెంట్‌ను ఎంచుకోవచ్చు.

మెరుగైన కంట్రోలర్ నావిగేషన్, రియల్-టైమ్ ఛాలెంజ్ స్కోర్ అప్‌డేట్‌లు మెరుగైన లైబ్రరీ ఫిల్టరింగ్ వంటి రాబోయే ఫీచర్‌, కొత్త వెల్‌కమ్ స్క్రీన్‌ను గేమ్స్ యాప్ ప్రవేశపెడుతోంది. ఐప్యాడ్‌లో, ఐప్యాడోస్ 26.2 బీటా 3 డాక్, స్పాట్‌లైట్ యాప్ లైబ్రరీ నుంచి స్ప్లిట్ వ్యూ లేదా స్లయిడ్ ఓవర్‌లోకి యాప్‌లను డ్రాక్ చేయగలదు. ఐప్యాడోస్ 18 నుంచి 26కి మారినప్పుడు డిలీట్ చేసిన మల్టీ టాస్కింగ్ గెచర్స్ తిరిగి తెస్తుంది.